మైక్రోసాఫ్ట్ సొంతంగా మొబైల్ సిమ్ ను లాంచ్ చేయనుంది : రిపోర్ట్

Updated on 08-Jan-2016

మైక్రోసాఫ్ట్ త్వరలోనే సొంతంగా సిమ్ కార్డ్ ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సెల్యులర్ డేటా యొక్క యాప్ పై టెస్టింగ్ దశలో ఉంది కంపెని.

యాప్ పేరు కూడా అదే, Cellular Data. ఇది విండోస్ 10 డివైజెస్ ను మొబైల్ నెట్ వర్క్ కు కనెక్ట్ చేయటానికి సహకరిస్తుంది. యాప్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్ లో ఉంది.

దాని description లో కూడా యాప్ పనిచేయటానికి మైక్రోసాఫ్ట్ సిమ్ కావాలి అని చెబుతుంది. కంప్లీట్ మొబైల్ నెట్ వర్క్ కాకపోయినా virtual నెట్ వర్క్ ను లాంచ్ చేస్తుంది అని అంచనా.

సో దాని ద్వారా విండోస్ 10 లాప్ టాప్స్/ pc లు – మొబైల్ carriers నెట్ వర్క్స్ తో కనెక్ట్ కాగలరు. దీని కోసం కంపెని ఇప్పటి మొబైల్ నెట్ వర్క్స్ తో ఒప్పందాలు కుదుర్చుకోవాలి.

మైక్రోసాఫ్ట్ నిన్న సర్ ఫేస్ ప్రో టాబ్లెట్స్ ను ఇండియాలో లాంచ్ చేసింది 4 వేరియంట్స్ లో. ముందుగా సర్ ఫేస్ 4 ను రిలీజ్ చేసింద, త్వరలోనే సర్ ఫేస్ ప్రో 3 కూడా తెస్తుంది అని చెబుతుంది. ప్రో 3 ధర 73,990 రూ. సర్ ఫేస్ ప్రో 4 ప్రైస్ – 89,990 రూ.

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :