మైక్రో సాఫ్ట్ డిజైన్ మరియు మొబైల్ ఫోనుల తయారీ ను నిలిపి వేయనుంది అని Finnish న్యూస్ పేపర్ రిపోర్ట్ చేసింది. ఈ విషయం పై కంపెని spokesman కూడా కామెంట్ చేయటానికి నిరాకరించారు.
మొన్ననే కంపెని feature(బేసిక్) ఫోనుల బిజినెస్ ను HMD కు సెల్ చేసింది కూడా. Foxconn అనుబంధంతో ఉన్న HMD 350 మిలియన్ డాలర్స్ కు కొనటం జరిగింది. కాని లుమియా ఫోనులు మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తుంది.
బుధవారం కూడా కంపెని స్మార్ట్ ఫోన్ బిజినెస్ లో తగ్గిన లెక్కలను బయట పెట్టింది. Finland దేశంలో 1,350 ఉద్యోగులను మరియు ఇతర దేశాలలో 500 ఉద్యోగులను కూడా తీసివేయనుంది.
Finland లో ఉన్న రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ను కూడా మూసివేస్తుంది. ఈ మూసివేతలన్నీ మైక్రో సాఫ్ట్ కొత్త ఫోనుల డెవలప్మెంట్ కు కూడా ఒక ముగింపు తెస్తుంది అని రిపోర్ట్స్.
Source: Reuters