8.1 పై రన్ అవుతున్న విండోస్ ఫోన్స్ లో అఫీషియల్ విండోస్ 10 అప్ డేట్ అండ్ eligible ఫోన్స్ లిస్టు
మైక్రోసాఫ్ట్ ఫైనల్ గా విండోస్ 10 అప్ డేట్ ను విడుదల చేసింది విండోస్ 8.1 పై రన్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ కు. అయితే మరలా అన్ని ఫోన్లకు కాదు.
eligible ఫోన్లకు మాత్రమే. eligible లిస్టు క్రింద ఉంది..చూడగలరు. అప్ డేట్ రెగ్యులర్ OTA కాదు.Upgrade Advisor అనే యాప్ ను విండోస్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ ఓపెన్ చేసి, Enable విండోస్ 10 అప్ గ్రేడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి నెక్స్ట్ కు వెళ్తే డివైజ్ ను చెక్ చేస్తుంది యాప్. మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే అదే విషయం చెబుతుంది లేదా ప్రోసెస్ ముందుకు వెళ్తుంది..
ఈ లిస్టు లో ఆల్రెడీ Insider ప్రోగ్రాం తో విండోస్ 10 పై రన్ అవుతున్న ఫోన్స్ ఉండవు. అప్ డేట్ లో ఇంపార్టెంట్ కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయి, సో పాత ఫోనుల్లో విండోస్ 10 ను రన్ చేస్తే కస్టమర్ ఎక్స్పీరియన్స్ కు ఎఫెక్ట్ ఉంటుంది అని చెబుతుంది.
విండోస్ 10 మొబైల os కు eligible అయిన ఫోన్స్..
- Lumia 1520
- Lumia 930
- Lumia 640
- Lumia 640XL
- Lumia 730
- Lumia 735
- Lumia 830
- Lumia 532
- Lumia 535
- Lumia 540
- Lumia 635 1GB
- Lumia 636 1GB
- Lumia 638 1GB
- Lumia 430
- Lumia 435
- BLU Win HD w510u
- BLU Win HD LTE x150q
- MCJ Madosma Q501