ప్రస్తుత మార్కెట్ లో అన్నీ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ నోకియా సబ్ బ్రాండింగ్ లో బేసిక్ మోడల్ ను అనౌన్స్ చేసింది. దీని పేరు నోకియా 222.
ఇది మొత్తం రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి సింగిల్ సిమ్ మరొకటి డ్యూయల్ సిమ్ వేరియంట్. బేసిక్ ఫోన్స్ కాని ఇంటర్నెట్ ను కూడా ప్రధానంగా అందిస్తున్నాయి ఈ మోడల్స్
నోకియా 222 2.5G కనెక్టివిటి తో వస్తుంది అంటే 2g కన్నా ఎక్కువ, 3g కన్నా తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. 2.4 in QVGA డిస్ప్లే తో 320 x 240 పిక్సెల్స్ ఉన్నస్క్రీన్ ఉంది. 2MP బ్యాక్ కెమేరా ఫిక్సడ్ ఫోకస్. ఫ్రంట్ కెమేరా లేదు. sd కార్డ్ సపోర్ట్ ఉంది. క్యాండీ బార్ form factor లో ఉంది డిజైన్
బ్లూటూత్ 3.0, మైక్రో usb, GPRS, 1100 mah బ్యాటరీ. స్టాండ్ బై లో ఒక నెల పాటు వస్తుంది బ్యాటరీ అని చెబుతుంది మైక్రోసాఫ్ట్. glossy బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో 2,450 రూ లకు సేల్ అవనుంది.
స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ కాలం వాడిన వారికీ 2 వేల రూ బడ్జెట్ లో మంచి బ్యాటరీ లైఫ్ తో నోకియా వంటి బ్రాండ్ తో వస్తున్న ఈ మొబైల్ మంచి ఎక్పిరియన్స్ ఇస్తుంది.