మైక్రో సాఫ్ట్ accidental గా తన అప్ కమింగ్ క్రేజీ మోడల్ ను reveal చేసింది. ఇది Surface ఫోన్ అయి ఉంటుంది అని అంచనా.
మైక్రోసాఫ్ట్ చైనా వెబ్ సైట్ లో ఒక వీడియో ను అప్ లోడ్ చేశారు. అది continuum ఫీచర్ ను వివరిస్తుంది. ఈ వీడియోకు సంబంధించి description లో వివరాలు లీక్ అయ్యాయి.
Continuum ఫీచర్ ను సపోర్ట్ చేసే ఫోన్స్ లిస్టు లో ఈ కొత్త డివైజ్ పేరు ను కూడా అనుకోకుండా వెల్లడించేసింది కంపెని. మైక్రోసాఫ్ట్ లుమియా 950XL, acer jade primo అండ్ లుమియా ఫోన్ X సపోర్ట్ చేస్తాయి.
గతంలో మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, Chris కూడా ఒక ఇంటర్ వ్యూ లో కంపెని breakthrough ఫోన్ తయారు చేస్తున్నట్లు తెలియజేసారు…ఇదే సర్ ఫేస్ ఫోన్ అనుకున్నారు అందరూ అప్పుడు.
అయితే దీనిని తయారు చేయటానికి బాగా టైం పడుతుంది అని అన్నారు. లేటెస్ట్ గా కంపెని లూమియ బ్రాండ్ నుండి ఈ ఇయర్ లో ఇక ఒక మోడల్ మాత్రమే రిలీజ్ చేయనుంది అనే రూమర్స్ వినిపిస్తునాయి. ఫిబ్రవరి 1 న లుమియా 650 మోడల్ లాస్ట్ అని రిపోర్ట్స్.