కాన్వాస్ స్లివర్ 5 ను లాంచ్ చేసిన మైక్రోమ్యాక్స్

కాన్వాస్ స్లివర్ 5 ను లాంచ్ చేసిన మైక్రోమ్యాక్స్
HIGHLIGHTS

ఇది మైక్రోమ్యాక్స్ ఫ్లాగ్ షిప్ మోడల్

ఇండియన్ మొబైల్ బ్రాండ్, మైక్రోమ్యాక్స్ ఈ సంవత్సరం నెలకు ఒక మోడల్ ను లాంచ్ చేస్తుంది. Knight 2, spark, డూడుల్ 4  వంటి మొబైల్స్ ను రీసెంట్ గా  మైక్రోమ్యాక్స్ లాంచ్ చేసింది. అయితే ఈ రోజు Knight 2 ప్రైసింగ్ సెగ్మెంట్ లోనే మరో ఫ్లాగ్ షిప్ మోడల్ ను రిలీజ్ చేసింది. ఈ మోడల్ పేరు Sliver 5. దీని హైలైట్స్ 5.1 mm సన్నని బాడీ.

మైక్రోమ్యాక్స్ స్లివర్ 5 స్పెసిఫికేషన్స్ – 64 బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 SoC, (ఇదే ప్రోసెసర్ యు యుఫోరియా లో వాడింది కంపెని. కాని దాని ధర 7,000 రూ.) 2జిబి ర్యామ్, 8MP సోనీ IMX219 బ్యాక్ కెమేరా సెన్సార్, బ్లూ గ్లాస్ ఫిల్టర్, 4.8 in ఎమోలేడ్ HD డిస్ప్లే. 16 జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు. ఆండ్రాయిడ్ లాలిపాప్, 4G దీనిలో ఉన్నాయి.

ఒక్క కెమేరా మినహా సేమ్ ఇవే స్పెసిఫికేషన్స్ తో ఇంతకముందే మైక్రోమ్యాక్స్ Knight 2 మోడల్ (16,499 రూ) ను Sliver 5 మోడల్ కన్నా తక్కువ ధర కు లాంచ్ చేసింది. దానికి దీనికి ప్రధానంగా చెప్పుకుంటే కెమేరా ఒకటే తేడా. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ Sliver 5 ధర 17,999 రూ,
జులై నెల లో Sliver స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరుపుకోనుంది. అయితే ఈ మోడల్ నుండి మైక్రోమ్యాక్స్ తన కస్టమర్ సర్వీస్ విధానాలను మెరుగు పరచనుంది. ఈ విషయం ప్రత్యేకంగా కంపెని వెల్లడించింది. 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo