ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్, ఈరోజు ఇండియాలో తన సబ్ బ్రాండ్ In Mobiles నుండి లేటెస్ట్ గా In Note 2 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో స్టైలిష్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్లతో వచ్చింది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ తో ప్యూర్ ఆండ్రాయిడ్ OS అందించడం పైన కంపెనీ ద్రుష్టి సారించినట్లు కనిపిస్తోంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజ్ కలిగి కేవలం రూ.13,490 రూపాయల ధరతో వచ్చింది. ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు బ్రౌన్ రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది మరియు జనవరి 30 నుండి micromaxinfo.com మరియు Flipkart లలో విక్రయించబడుతుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G95 ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు 4జిబి ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో జతగా వస్తుంది. SD కార్డు సహాయంతో 256 జిబి వరకూ స్టోరేజ్ మరితంగా విస్తరించవచ్చు. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఫోన్ 30W క్విక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mah బ్యాటరీతో వస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ కెమెరా బరస్ట్ మోడ్, టైం ల్యాప్స్, సెటప్ నైట్ మోడ్, ప్రో మోడ్ మరియు QR Scan వంటి ఫీచర్స్ సపోర్ట్ తో వస్తుంది. సెల్ఫీల కోసం 16 ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఇది బ్లోట్ వేర్ లేకుండా స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభూతిని అందించే వీలుగా, Stock Android 11 OS పైన నడుస్తుంది.