రూ. 6,569 లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ యునైట్ 3 స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. ఫోన్ లో యునైట్ మెసేజింగ్ సర్వీసు ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే కంపెని పేటెంట్ ఫీచర్ అయిన స్వైప్ తో మెసేజ్ ను ఏ బాష లోకి అయినా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్ సైటు infibeam.com లో మైక్రోమ్యాక్స్ ఆల్రెడీ అమ్మకాలు మొదలుపెట్టింది.
స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 4.7 in IPS(480×800) డిస్ప్లే, 8 జిబి ఇంబిల్ట్ మరియు 32జిబి అదనపు స్టోరేజి, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్ యునైట్ 3 లో ఉన్నాయి. కెమేరా విభాగంలో 8MP ఆటో ఫోకర్ LED బ్యాక్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా జోడించింది మైక్రోమ్యాక్స్. కనెక్టివిటి లో డ్యూయల్ సిమ్, ౩జి, వైఫై, బ్లూటూత్ 4.0 మరియు GPS ఉన్నాయి. 2000 mah బ్యాటరీ ఉన్న యునైట్ 3 220 గంటలు పాటు స్టాండ్ బై టైం మరియు 8 గంటల టాక్ టైం ను ఇస్తుంది అని కంపెని చెబుతుంది. వైట్, బ్లూ కలర్స్ లో ఇది లభ్యమవుతుంది.
ఈ ఫోన్ లో ఆప్ బజార్ సహాయం తో మీకు కావలిసిన ఆప్స్ ను మీ రిజినల్ బాష లో ఇంస్టాల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మెనూ మరియు హెల్ప్ మీ రిజినల్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. యునైట్ 3 యునైట్ 2 పేరుతొ సక్సెస్ఫుల్ అయిన మోడల్ కి అప్ గ్రేడేడ్ మోడల్. గత సంవత్సరం రిలీజ్ అయిన యునైట్ 2 మైక్రోమ్యాక్స్ టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ లలో ఒకటి. యునైట్ 2 లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటికి 1.5 మిలియన్లు డివైజు లు అమ్ముడుపోయాయి.
దీని లాంచ్ కు ముందే సైలెంట్ గా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ సిరిస్ ఫోర్త్ హాండ్ సెట్ కాన్వాస్ డూడుల్ 4 ను లాంచ్ రూ.9,499 లకు చేసింది. 6in 720×1280 రిసల్యుషణ్ HD డిస్ప్లే దీని సొంతం. దీనితో స్టైలస్ కూడా వస్తుంది. ధర పది వేలకు దగ్గరలో ఉన్నపటికీ ఇందులో 1జిబి ర్యామ్ ను వాడింది మైక్రోమ్యాక్స్. 8 జిబి ఇంబిల్ట్, ఆండ్రాయిడ్ లాలిపాప్,డ్యూయల్ సిమ్, 8MP బ్యాక్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, ౩జి, 3000mah బ్యాటరీ దీని సొంతం. కాన్వాస్ డూడుల్ 4 లో ప్రధానంగా చెప్పుకోవలిసినది కేవలం 6 అంగుళాల డిస్ప్లే మరియు స్టైలస్ మాత్రమే.