ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు మొబైల్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ తయారీ యూనిట్
తిరుపతి లో కంపెనీలు స్టార్ట్ చేసేందుకు ఒప్పొందం కుదిరింది.
ఇండియా లో స్మార్ట్ ఫోన్ లను తయారీ చేస్తున్న మైక్రోమ్యాక్స్, కార్బన్ అండ్ celkon కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్లాంట్ లను మొదలు పెడుతున్నాయి.
తిరుపతి లో ఇవి యూనిట్ లను స్థాపించనున్నాయి. ఆంధ్రా గవర్నమెంట్ వచ్చే సంవత్సరానికల్లా నెలకు 6 – 7 మిలియన్ల యూనిట్లను తయారు చేయమని కంపెనీలకు అడిగింది.
గత నెలలోనే మైక్రోసాఫ్ట్ కూడా ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ తో పార్టనర్ షిప్ కుదుర్చుకుంటుంది అని అనౌన్స్ చేసింది. ఇది ఇండియాలో తక్కువ ధరలో ఇంటర్నెట్ ను అందించటానికి కొత్త టెక్నాలజీ ను ఉపయోగించి చేస్తున్న ప్రాజెక్ట్.
ఇందులో భాగంగా వాడకుండా ఉన్న టీవీ వైట్ స్పేసెస్ టెక్నాలజీ ను ఇంటర్నెట్ అందించటానికి వాడనుంది మైక్రోసాఫ్ట్. ఇప్పటికే xiaomi రెడ్మి 2 prime ఫోనులు కూడా ఆంద్రప్రదేశ్ లోనే తయారీ అయ్యి సేల్ అవుతున్నాయి.
Foxconn అనేది ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ సంస్థ. ఇది కూడా ఆంద్రప్రదేశ్ లో ఉంది. దీని నుండి xiaomi, Gionee ఫోనులను తయారు అవుతున్నాయి.
ఓవర్ ఆల్ గా గవర్నమెంట్ కొత్తగా డివైడ్ అయిన ఆంధ్రా రాష్ట్రం లో మొబైల్ తయారీ ప్లాంట్ లను నెలకొలిపి, అటు గవర్నమెంట్ రెవెన్యూ తో పాటు ఇటు ఉద్యోగ అవకాశాలను సైతం పెంచే యత్నాలు చేస్తుంది.