4G VoLTE తో మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మెగా 2 ప్లస్ లాంచ్

Updated on 16-Mar-2017
HIGHLIGHTS

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మెగా 2 ప్లస్ స్మార్ట్ ఫోన్ కేవలం 7,499 రూ లకే ఆఫ్ లైన్ లో అందుబాటు

4G VoLTE తో మైక్రోమ్యాక్స్ కాన్వాస్  మెగా  2 ప్లస్ లాంచ్ 

మైక్రోమ్యాక్స్ వారు  కాన్వాస్  మెగా  2 ప్లస్ అనే  కొత్త  స్మార్ట్ ఫోన్  ను  లాంచ్  చేశారు. ముంబై  రిటైలర్ మహేష్  టెలికాం  నుంచి వచ్చిన  నివేదిక  ప్రకారం మైక్రోమ్యాక్స్ కాన్వాస్  మెగా  2 ప్లస్ స్మార్ట్  ఫోన్ కేవలం 7,499 రూ లకే  ఆఫ్ లైన్  లో అందుబాటులో  కలదు. ఈ స్మార్ట్ ఫోన్  బ్లాక్  కలర్  లో లభ్యం. మైక్రోమ్యాక్స్ ఈడివైస్ లో Q426  లో 6 ఇంచెస్  ఐపీఎస్ డిస్ప్లే వుంది. ఈ  డివైస్  యొక్క రెసొల్యూషన్ 960 x 540p గా  వుంది. మరియు ఒక 1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ వుంది. మరియు 2 జీబీ  రామ్  ,16 జీబీ  ఇంటర్నల్  స్టోరేజ్  ను  మైక్రో  sd  ద్వారాగా  ఎక్స్  పాండ్  చేయవచ్చు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్  ఉంది. 3000mAh బ్యాటరీ  కలిగి  వుంది. 

ఇక  కెమెరా  చూసినట్లయితే  8 మెగాపిక్సల్ ఆటో ఫోకస్  రేర్  కెమెరా LED  ఫ్లాష్  తో ఇస్తున్నారు. మరియు  ముందర 5 మెగా  పిక్సెల్  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  పొందుపరచబడి  వుంది. మరియు  డ్యూయల్  సిమ్ ,4G VoLTE,వైఫై, బ్లూటూత్ 4.0, GPS మరియు ఒక microUSB పోర్ట్ వంటివి  వున్నాయి. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :