మైక్రోమ్యాక్స్ కొత్త మోడల్ Knight 2 లాంచ్ అయ్యింది.
తాజా సర్వే లో మైక్రోమ్యాక్స్ టాప్ టెన్ వరల్డ్ మొబైల్ సేల్స్ లో చోటు సంపాదించింది.
16,299 రూ లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ Kinght 2 మోడల్ ను లాంచ్ చేసింది. ఇంత బడ్జెట్ పెట్టి కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్ లో మొబైల్ కొనటానికి చూస్తారు కాని, మైక్రోమ్యాక్స్ వంటి లోకల్ బ్రాండ్ కొనేవారు చాలా అరుదు. అయినా సరే మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ను మించిన ప్రైస్ ను పెట్టింది అంటే కాన్వాస్ Kinght 2 లో ఏదైనా విషయం ఉందేమో, రండి చూద్దాం.
పోయిన సంవత్సరం లాంచ్ అయిన కాన్వాస్ Knight మొదటి మోడల్ కు ఇది అపగ్రేడ్ మోడల్. కాన్వాస్ knight 2 స్పెసిఫికేషన్స్ –
5in 720P గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలిపాప్, 64 బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 32 జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ సోని IMX214 CMOS సెన్సార్ మరియు లార్గాన్ 5P లెన్స్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, Cirrus లాజిక్ Wolfson స్టీరియో ఆడియో, 2260mah బ్యాటరీ, LTE 4G దీనిలో ఉన్నాయి.
ఎయిర్టెల్ తో టై అప్ అయిన మైక్రోమ్యాక్స్ ఉచితంగా ఫ్రీ 4జి సిమ్ ను ఇవ్వనుంది కాన్వాస్ Knight 2 తో, అంతేకాక డబుల్ 4జి డేటా ను సిమ్ తో పాటు ఏక్టివేట్ చేయనుంది ఎయిర్టెల్. కాన్వాస్ knight 2 వచ్చే వారం బుధవారం నుండి సేల్ అవనుంది. రాబోవు నెలలో కూడా కొన్ని 4జి డివైజ్ లను లాంచ్ చేస్తాం, అయితే ఇవి బడ్జెట్ ధర నుండి వేరియాస్ ప్రైస్ సెగ్మెంట్స్ లో రానున్నాయి. మా పాపులర్ కావాస్ ఫైర్, యునైట్ మరియు నైట్రో మోడల్స్ కూడా నెమ్మదిగా 4జి ఆఫర్స్ ను అందుకోకున్నాయి. అయితే మైక్రోమ్యాక్స్ నుండి వస్తున్న మొదటి LTE 4జి మోడల్ కాన్వాస్ knight 2 దేశంలోనే క్వాలిటీ ఇంటర్నెట్ ను అందించనుంది" అని అన్నారు వినీట్ తనేజా, మైక్రోమ్యాక్స్ సి.యి.ఓ.
గత సంవత్సరం రిలీజ్ అయిన Kinght మోడల్ మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన మొదటి ఆక్టో కోర్ మోడల్, దాని ధర 19,999 రూ. HD డిస్ప్లే, 16MP కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 32 జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 2350mah బ్యాటరీ knight మొదటి మోడల్ లో ఉన్నాయి.
అయితే ఆక్టో కోర్ ప్రాసెసర్ తో Cameo పేరుతొ మైక్రోమ్యాక్స్ 11,490 రూ లకు వేరే మోడల్ ను కూడా లాంచ్ చేసింది. దీనికి 4.7in IPS 1280 x 720 రిసల్యుషణ్ డిస్ప్లే, 8MP మరియు 5MP కెమేరా, 8జిబి సఇంబిల్ట్ మరియు 32 అదనపు స్టోరేజ్ సదుపాయం.