కాన్వాస్ సిరిస్ లో కాన్వాస్ Hue 2 ను విడుదల చేసింది మైక్రోమ్యాక్స్. ఈ – కామెర్స్ మరియు రిటేయిల్ స్టోర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. దీని ధర 11,736 రూ. 2015 జనవరి నెలలో విడుదలైన కాన్వాస్ Hue కు ఇది అప్ గ్రేడ్ మోడల్. అంటే లోకల్ ఇండియన్ బ్రాండే కేవలం 6 నెలల వ్యవది లో రెండవ మోడల్ ను లాంచ్ చేస్తుంది అంటే మిగిలిన ఇంటర్నేషనల్ స్మార్ట్ ఫోన్ కంపెనీల సంగతి ఏంటో ఆలోచించండి.
కాన్వాస్ Hue 2 (A316) స్పెసిఫికేషన్స్ – 5in 720×1280 పిక్సెల్స్ HD డిస్ప్లే, 1.7 GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రోసెసర్, 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 32 అదనపు స్టోరేజ్ సదుపాయం, డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై, 3G, GPRS/ EDGE, వైఫై, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్, బ్లూటూత్, 13MP కెమేరా, LED ఫ్లాష్, 5MP ఫ్రంట్ కెమేరా, ఇంబిల్ట్ అక్సేలేరోమీటర్, ambient లైట్ సెన్సార్, మాగ్నేటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్. 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 అవుట్ ఆఫ్ ది బాక్స్.
కాన్వాస్ Hue 2 స్మార్ట్ ఫోన్, Meizu M1 నోట్, మోటో G (2nd జెన్) మరియు Huawei హానర్ 4x మోడల్స్ కు పోటీ ఇవ్వనుంది. తాజాగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ knight 2 4G స్మార్ట్ ఫోన్ ను 16,299 రూ. లకు లాంచ్ చేసింది. ఇది మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ (ఫ్లాగ్ షిప్ అంటే ఆ కంపెని యొక్క హై ఎండ్ మోడల్) డివైజ్. దీని గురించి అధిక సమాచారం ఇక్కడ పొందగలరు.
ఆధారం: TOI