6,039 రూ. లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ A1 AQ4502

Updated on 02-Jun-2015
HIGHLIGHTS

ఇది గత సంవత్సరం రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ వన్ ఫోన్ కు రెండవ మోడల్

మైక్రోమ్యాక్స్ గత సంవత్సరం రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ వన్ A1 (AQ4501)  ఫోన్ కు రెండవ మోడల్ A1 (AQ4502) ను అదే పేరు మీద దింపింది. అయితే మైక్రోమ్యాక్స్ కాన్వాస్ A1(AQ4502) 6,039 రూ లకు ఒక ఈ కామర్స్ వెబ్ సైటు లో కనిపిస్తుంది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ A1(AQ4502) స్పెసిఫికేషన్స్ – 4.5 in ( 480 x 854 పిక్సెల్స్) IPS FWVGA డిస్ప్లే, లాలిపాప్, 1.3 GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 1జిబి ర్యామ్, 32జిబి అదనపు స్టోరేజి సపోర్ట్, 5MP LED ఫ్లాష్ బ్యాక్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. కనెక్టివిటి విభాగంలో వైఫై, బ్లూటూత్, GPS, 3జి, 1700 mah బ్యాటరీ ఉన్నాయి. 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ A1(AQ4502) ebay వెబ్ సైటు లో 6,039 రూ. లకు కొనుకున్నే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మోటో, లెనోవో మరియు Xiaomi వంటి బ్రాండ్స్ 7వేల రూ. బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేస్తున్నాయి కాబట్టి, వాటితో ఈ ఫోన్ ఎంత వరకూ పోటీ పడగలదో చూడాలి. తాజాగా మైక్రోమ్యాక్స్ యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్ మోడల్స్ ను కూడా 7,000 బడ్జెట్ లో లాంచ్ చేసింది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ A1(AQ4502)  ebay  లో  ఇక్కడ కొనవచ్చు

మైక్రోమ్యాక్స్ యునైట్ 3 స్నాప్ డీల్ లో 6506 రూ. ఈ లింక్ లో దొరుకుతుంది. 

కాన్వాస్ స్పార్క్ 4,999 రూ లకు ఈ లింక్ లో కొనవచ్చు.

 

Connect On :