మైక్రో మాక్స్ రెండు ఫ్లాగ్ షిప్ ఫోనులను లాంచ్ చేసింది. ఒక దాని పేరు కాన్వాస్ 6, మరొకటి కాన్వాస్ 6 ప్రో. విశేషం ఏంటంటే రెండు మోడల్స్ ఒకే ప్రైస్ 13,999 రూ లతో వస్తున్నాయి.
కాన్వాస్ 6 మెటల్ unibody డిజైన్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్న మొదటి ఫోన్ మైక్రో మాక్స్ నుండి. దీనిలో 5.5 in ఫుల్ HD డిస్ప్లే,
మీడియా టెక్ Helio X10 ప్రొసెసర్, 3GB ర్యామ్, 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 32GB ఇంటర్నెల్ స్టోరేజ్, 3000 mah బ్యాటరీ కలిగి ఉన్నాయి.
కాన్వాస్ 6 ప్రో రెండవ మోడల్ లో కూడా 5.5 in ఫుల్ HD డిస్ప్లే మరియు మీడియా టెక్ Helio X10 ప్రొసెసర్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటంటే – 4GB ర్యామ్..
ఇంకా 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ దీనిలో ఉన్నాయి. అంటే ర్యామ్ పెంచి ఫ్రంట్ కెమెరా మరియు ఇంటర్నెల్ స్టోరేజ్ ను తగ్గించింది కాన్వాస్ 6 తో పోలిస్తే..