టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ, Gartner తాజా సర్వేలో మన ఇండియన్ డొమెస్టిక్ స్మార్ట్ ఫోన్ కంపెని, మైక్రోమ్యాక్స్ 2015 మొదటి క్వార్టర్ కి వరల్డ్ 10th లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ వెండర్ గా స్థానం సంపాదించింది.
రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్ వైడ్ గా టోటల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా 2015 సంవత్సరం మొదటి క్వార్టర్ లో 19 శాతం వృద్ధి ని సంపాదించుకుంది. 1.8 శాతం వరల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ తో మైక్రోమ్యాక్స్ 10వ స్థానంలో ఉంది. దీనిపై మైక్రోమ్యాక్స్ మాట్లాడుతూ.. " ఇందుకు ప్రధాన కారణం, మైక్రోమ్యాక్స్ రిలీజ్ చేసిన కాన్వాస్ సిరిస్ అని చెప్పింది. కాన్వాస్ సిరిస్ లో మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్, కాన్వాస్ Knight, కాన్వాస్ ఫైర్ మోడల్స్ ను లాంచ్ చేసింది. అయితే తాజాగా జరిగిన ఈ రిపోర్ట్స్ లో మైక్రోమ్యాక్స్ యు బ్రాండ్ పేరుతొ రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్ సేల్స్ మార్కెట్ ఉందా లేదా అనేది స్పష్టం చేయలేదు Gartner.
సామ్సంగ్ 21.3 షేర్ తో టాప్ పొజిషన్ లో ఉండగా, ఆపిల్ 13.1 షేర్ తో రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో 7.2 మార్కెట్ షేర్ తో మైక్రోసాఫ్ట్ ఉండగా, నాలుగవ స్థానంలో 4.3 షేర్ తో LG ఉంది. దీనికి అతి దగ్గరిలోనే 4.2 మార్కెట్ షేర్ తో లెనోవో 5వ స్థానంలో ఉంది. Huawei 4.0 షేర్ తో 6వ స్థానంలో ఉంది. Xiaomi 3.2 పర్సెంటేజి తో 7వ స్థానంలో ఉంది. 8, 9 స్థానాలను TCL మరియు ZTE సంపాదించుకున్నాయి.
Gartner రీసర్చ్ డైరెక్టర్, అన్షుల్ గుప్తా మాట్లాడుతూ.. " మొత్తం 2015 మొదటి క్వార్టర్ కి 336 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు అయ్యాయి. ఇది 19.3 శాతం గ్రోత్ రేట్ తో ఉంది. ఈ క్వార్టర్ లో చైనీస్ బ్రాండ్స్ కొత్తగా వచ్చిన సక్సెఫుల్ కంపెనీల లిస్టు లో ఉన్నాయి. 73 పర్సెంట్ గ్రోత్ రేట్ తో 38 నుండి 47 శాతం వరల్డ్ మార్కెట్ షేర్ తో చైనీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ముందుకు వెళ్తుంది." అని అన్నారు.
మైక్రోమ్యాక్స్ మాట్లాడుతూ…" నిరంతరంగా కొత్త కొత్త మోడల్స్ తో మార్కెట్ లో ఉండటం మరియు వినియోగదారులు కోరికలను, ఇష్టాలను అర్థం చేసుకోవటం వలనే ఈ స్థానం వచ్చింది ." అని చెప్పింది.
ఆధారం: Gartner