Xiaomi నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ మోడల్, Mi 5 గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ఇండియన్ మార్కెట్ లో స్నాప్ డ్రాగన్ పవర్ ఫుల్ లేటెస్ట్ ప్రొసెసర్ 820 SoC తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్.
ఇప్పుడు కంపెని దీని ప్రైస్ ను అఫీషియల్ గా మరియు పెర్మనంట్ గా తగ్గించింది. ఇప్పటి వరకూ 24,999 రూ ఉండేది. ఇప్పుడు 22,999 రూ లకు ఫ్లిప్ కార్ట్ మరియు Mi.com లో సేల్స్ అవుతుంది.
దీని రివ్యూ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు. ఈ ప్రైస్ లో ఫోన్ అయితే మంచిదే, కాని స్క్రీన్ సైజ్ 5.2 in అంటే కంపాక్ట్ users కు మంచి ఫోన్ కచ్చితంగా అన్ని విధాలుగా.
టోటల్ స్పెక్స్ విషయానికి వస్తే Mi 5 లో డ్యూయల్ నానో సిమ్, 5.15 in FHD 3D curved సిరామిక్ గ్లాస్ డిస్ప్లే with 428PPi, స్నాప్ డ్రాగన్ 820 SoC.
అద్రెనో 530 GPU, 16MP సోనీ IMX 298 కెమెరా with PDAF అండ్ LED ఫ్లాష్ అండ్ 4-ఆక్సిస్ OIS, 4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
3000 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, usb టైప్ c పోర్ట్, VoLTE సపోర్ట్, NFC, బ్లూ టూత్ 4.2 తో చాలా లైట్ వెయిట్ – 129 గ్రా బరువు కలిగి ఉంది ఫోన్.
Mi 5 లో ఉన్న 4 కొత్త టెక్నాలజీ ఫీచర్స్ కొరకు ఈ లింక్ లో చూడండి.
Mi ను యొక్క ఇమేజెస్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.
గతంలో 3GB ర్యామ్ ఉన్న Mi 5 ను 4GB ర్యామ్ ఉన్న oneplus 2 తో కంపేర్ చేసి ఏది బెస్ట్ అని తెలపటం జరిగింది ఈ లింక్ లో.