3D టచ్ సపోర్ట్, సామ్సంగ్ ప్రొసెసర్ తో 4GB రామ్ ఫోన్ రిలీజ్ చేసిన Meizu

Updated on 30-Nov-2016

Meizu నుండి రెండు మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి చైనాలో. Pro 6 ప్లస్(29,900రూ) అండ్ M3X(16,900 రూ) వీటి పేరులు.

ఇవి రెండు వేరియంట్స్ లో వస్తున్నాయి. 3GB/32GB M3X ప్రైస్ 16,900 రూ, 4GB/64GB ప్రైస్ 19,900 రూ. అలాగే Pro 6 ప్లస్ 64GB ప్రైస్ 29,900 రూ, 128GB ప్రైస్ 32,800 రూ.

M3X స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in FHD డిస్ప్లే, 2.3GHz మీడియా టెక్ P20 ఆక్టో కోర్ SoC, 12MP డ్యూయల్ tone led ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3200 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 6.0, 4G VoLTE, USB టైప్ C పోర్ట్, 165 గ్రా బరువు.

Pro 6 ప్లస్ స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5.7 QHD సూపర్ అమోలేడ్ గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే with 3D pressure సెన్సిటివ్ డిస్ప్లే. అంటే ఆపిల్ తరహా లో లైట్ గా టచ్ చేస్తే యాప్ ఓపెన్ చేయకుండానే యాప్ లోని వివిధ ఫంక్షన్స్ ను చూపించటం లేదా డైరెక్ట్ గా access చేసే అవకాశం కలిపించటం.

4GB రామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, సామ్సంగ్ Exynos 2GHz అండ్ 2.3GHz వేరియంట్స్ SoC's, 12MP సోనీ IMX386 రేర్ OIS కెమెరా with 10-LED రింగ్ ఫ్లాష్ (కొత్త టెక్నాలజీ).

5MP ఫ్రంట్ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్, 3400 mah బ్యాటరీ, USB టైప్ C పోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 based Flyme 6 యూజర్ ఇంటర్ఫేస్, 4G VoLTE, NFC, 158 గ్రా బరువు ఉన్నాయి.

ఫోన్ గోల్డ్, deep ash అండ్ సిల్వర్ కలర్స్ తో రానుంది.వీటి ఇండియన్ రిలీజ్ డిటేల్స్ ప్రస్తుతానికి తెలియవు.

 

Connect On :