8,200 రూ లకు 5in డిస్ప్లే అండ్ 3GB ర్యామ్ తో Meizu M3 లాంచ్

Updated on 26-Apr-2016

Meizu నుండి M3 ఫోన్ రిలీజ్ అయ్యింది చైనా లో. రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుంది. ఒకటి 2GB 16GB, మరొకటి 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్.

మొదటి వేరియంట్ ప్రైస్ – 6100 రూ. రెండవ వేరియంట్ ప్రైస్ – 8,200 రూ. ఇవి చైనీస్ కన్వర్షన్ ప్రైస్. సో ఇండియాలో ఏ ప్రైసేస్ కు రిలీజ్ అవుతాయి అని చెప్పలేము ఇప్పుడు..

 ఇది M2 నోట్ కు అప్ గ్రేడ్ మోడల్ కాదు, M2 మోడల్ కు అప్ గ్రేడ్ మోడల్. ఫోన్ polycarbonate బాడి తో వస్తుంది. ఇంకా మిగిలిన స్పెక్స్ చూడండి…

  • 5 in HD 2.5D గ్లాస్ డిస్ప్లే with 296PPi అండ్ Schott Xensation cover glass ప్రొటెక్షన్
  • డ్యూయల్ సిమ్ – హై బ్రిడ్ స్లాట్
  • మీడియా టెక్ 1.5GHz ఆక్టో కోర్ MT6750 SoC
  • 13MP PDAF రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్
  • 2870 mah బ్యాటరీ
  • 4G LTE
  • SD కార్డ్ సపోర్ట్
  • 132 గ్రా బరువు
  • ఆండ్రాయిడ్ 5.1 os బేస్డ్ flyme యూజర్ ఇంటర్ఫేస్ 5
  • గ్రే, గోల్డ్, వైట్, బ్లూ, పింక్  కలర్స్ లో వస్తుంది

కంపెని ఇదే నెలలో M2 నోట్ మోడల్ కు నెక్స్ట్ మోడల్ M3 నోట్ ను కూడా లాంచ్ చేసింది చైనా లో. దీని చైనీస్ ప్రైస్ 10,300 రూ. అయితే ఈ రెండు మోడల్స్ ఇండియాలోకి ఎప్పుడు రానున్నాయి అనేది ఇంకా వెల్లడికాలేదు.

M3 నోట్ లో 5.5 in FHD డిస్ప్లే, 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్, 13 అండ్ 5MP కేమేరాస్ with అల్యూమినియం బాడీ. Meizu ఇదే నెలలో మరొక మోడల్ Pro 6 ను కూడా 25 వేల కు 4GB ర్యామ్ తో లాంచ్ చేసింది చైనాలో. 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :