8,200 రూ లకు 5in డిస్ప్లే అండ్ 3GB ర్యామ్ తో Meizu M3 లాంచ్
Meizu నుండి M3 ఫోన్ రిలీజ్ అయ్యింది చైనా లో. రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుంది. ఒకటి 2GB 16GB, మరొకటి 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్.
మొదటి వేరియంట్ ప్రైస్ – 6100 రూ. రెండవ వేరియంట్ ప్రైస్ – 8,200 రూ. ఇవి చైనీస్ కన్వర్షన్ ప్రైస్. సో ఇండియాలో ఏ ప్రైసేస్ కు రిలీజ్ అవుతాయి అని చెప్పలేము ఇప్పుడు..
ఇది M2 నోట్ కు అప్ గ్రేడ్ మోడల్ కాదు, M2 మోడల్ కు అప్ గ్రేడ్ మోడల్. ఫోన్ polycarbonate బాడి తో వస్తుంది. ఇంకా మిగిలిన స్పెక్స్ చూడండి…
- 5 in HD 2.5D గ్లాస్ డిస్ప్లే with 296PPi అండ్ Schott Xensation cover glass ప్రొటెక్షన్
- డ్యూయల్ సిమ్ – హై బ్రిడ్ స్లాట్
- మీడియా టెక్ 1.5GHz ఆక్టో కోర్ MT6750 SoC
- 13MP PDAF రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్
- 2870 mah బ్యాటరీ
- 4G LTE
- SD కార్డ్ సపోర్ట్
- 132 గ్రా బరువు
- ఆండ్రాయిడ్ 5.1 os బేస్డ్ flyme యూజర్ ఇంటర్ఫేస్ 5
- గ్రే, గోల్డ్, వైట్, బ్లూ, పింక్ కలర్స్ లో వస్తుంది
కంపెని ఇదే నెలలో M2 నోట్ మోడల్ కు నెక్స్ట్ మోడల్ M3 నోట్ ను కూడా లాంచ్ చేసింది చైనా లో. దీని చైనీస్ ప్రైస్ 10,300 రూ. అయితే ఈ రెండు మోడల్స్ ఇండియాలోకి ఎప్పుడు రానున్నాయి అనేది ఇంకా వెల్లడికాలేదు.
M3 నోట్ లో 5.5 in FHD డిస్ప్లే, 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్, 13 అండ్ 5MP కేమేరాస్ with అల్యూమినియం బాడీ. Meizu ఇదే నెలలో మరొక మోడల్ Pro 6 ను కూడా 25 వేల కు 4GB ర్యామ్ తో లాంచ్ చేసింది చైనాలో.