6,999 రూ లకు Meizu M2 స్నాప్ డీల్ లో లాంచ్

Updated on 09-Oct-2015
HIGHLIGHTS

రిజిస్ట్రేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

Meizu M2 అనే పేరుతో కొత్త Low బడ్జెట్ హాండ్ సెట్ రిలీజ్ అవుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఇప్పుడు 6,999 రూ లకు కేవలం స్నాప్ డీల్ లో సేల్ కు రెడీ గా ఉంది.

అక్టోబర్ 12 న ఫ్లాష్ సేల్స్ లో సేల్ కానుంది. ఇది కొనాలని అనుకునే వారు స్నాప్ డీల్ లో ఈ లింక్ లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వగలరు. ఇంతకముందు ఫోన్ m2 నోట్ మాత్రం అమెజాన్ లో సేల్ అయ్యింది.

meizu m2 స్పెసిఫికేషన్స్ – 5 in 720P HD AGC డ్రాగన్ టెయిల్ గ్లాస్ డిస్ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735 ప్రొసెసర్, 2gb LPDDR3 ర్యామ్.

16gb శామ్సంగ్ eMMC 5.0 ఫ్లాష్ మెమరీ, 128 gb sd కార్డ్ సపోర్ట్, 13MP శామ్సంగ్ CMOS 5 element లెన్స్ f/2.2 రేర్ కెమేరా, 5MP FotoNation 2.0 సాఫ్ట్ వేర్ ఉన్న ఫ్రంట్ కెమేరా.

4G ఇంటర్నెట్, డ్యూయల్ సిమ్, 2nd సిమ్ స్లాట్ లో sd కార్డ్ స్లాట్ కూడా ఉంది. ప్రత్యేకంగా sd కార్డ్ కు స్లాట్ లేదు. బ్లూటూత్ 4.0, 2500 mah బ్యాటరీ, Flyme ui 4.5 – ఆండ్రాయిడ్ 5.1. బరువు – 131 గ్రా

ఇది డైరెక్ట్ గా రెడ్మి 2 prime మరియు YU యుఫోరియా కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :