చైనీస్ హాండ్ సెట్ మేకర్, Meizu m2 నోట్ ను 4జి LTE గ్లోబల్ సపోర్ట్ తో అనౌన్స్ చేసింది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో రానుంది. ప్రస్తుతానికి చైనా లో ఇది JD.com సైటు లో కొనేందుకు అందుబాటులో ఉంది.
Meizu M2 నోట్ స్పెసిఫికేషన్స్- 5.5 in IGZO(1920 x 1080 పిక్సెల్స్ ) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 1.3 GHz 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT6753 ప్రాసెసర్, మాలి T720 GPU, ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆధారిత ఫ్లైమ్ యూజర్ ఇంటర్ఫేస్, 2జిబి DDR3 ర్యామ్, 16/32 జిబి ఇన్ బిల్ట్ స్టోరేజ్, 128 జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP బ్యాక్ మరియు 5MP ఫ్రంట్ 69 డిగ్రీ వైడ్ వ్యూయింగ్ ఏంగిల్. Meizu m2 నోట్ లో ప్రత్యేకంగా హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ గా రానుంది. దీని ప్రత్యేకత మొదటి స్లిమ్ స్లాట్ ను మైక్రో ఎస్డి ఎక్స్పాన్సన్ స్లాట్ గా కూడా ఉపయోగించుకోవటం.
దీనిలోని మరో ప్రత్యేకత mBack టచ్ సెన్సిటివ్ హోమ్ బటన్. బటన్ ను యూజ్ చేసే దాని బట్టి అది ఒకే బటన్ లో అనేక ఫంక్షన్స్ ను ఇస్తాది. సాఫ్ట్ గా ప్రెస్ చేస్తే, బ్యాక్ బటన్, గట్టిగా ప్రెస్ చేస్తే హోమ్ బటన్ గా పనిచేస్తుంది. కనెక్టివిటి లో 4జి LTE, 3జి, వైఫై, బ్లూటూత్4.0, GPS సపోర్ట్, 3100 mah బ్యాటరీ ఉన్నాయి. గ్రే, బ్లూ, పింక్, వైట్ కలర్స్ లో ఇది లభ్యం కానుంది. 8,220 రూ ధరకి 16జిబి, 10,284 రూ. లకు 32 జిబి వెర్షన్ Meizu m2 నోట్ కొనవచ్చు.
అయితే క్రిందటి నెలలోనే Meizu m1 నోట్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. m1 నోట్ ఐఫోన్ 5C మాదిరి లుక్స్ తో ఉంటుంది. కానీ 5.5 1080P డిస్ప్లే సైజులో ఉంటుంది m1 నోట్. 64 బిట్ మీడియా టెక్ ఆక్టో కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16/32 జిబి వేరియంట్స్ , 13MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమేరా, 4.4.4 ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ os, ఫ్లైమ్ 4.0 యూజర్ ఇంటర్ఫేస్, డ్యూయల్ సిమ్(4జి+2జి), వైఫై, బ్లూటూత్ మరియు usb కనెక్టివిటి 3,140 mah బ్యాటరీ ఇందులో ఉన్నాయి.
ఆధారం: Meizu