డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ తో MT6739 బడ్జెట్ చిప్సెట్ ని మీడియా టెక్ పరిచయం చేసింది

Updated on 31-Jan-2018

చిప్సెట్ తయారీదారు మీడియా టెక్ ఒక కొత్త బడ్జెట్ చిప్సెట్ ని  ప్రవేశపెట్టింది. ఈ చిప్సెట్ ని  Android ఒరియో (గో ఎడిషన్) తో అనుకూలంగా ఉన్న స్మార్ట్ఫోన్లను దృష్టిలో పెట్టుకుని  తయారు చేస్తారు. మీడియా టెక్ ఈ కొత్త ప్రాసెసర్ గురించి ఇండియాలో ప్రకటించింది. ఈ కొత్త చిప్సెట్ కి  మీడియా టెక్ MT6739 గా పేరు పెట్టారు. ఇది కార్టెక్స్ A53 కోర్సుతో వచ్చే క్వాడ్-కోర్ చిప్సెట్, దీని క్లాక్ స్పీడ్  1.3 / 1.5GHz. ఇది డ్యూయల్  4G VoLTE మద్దతుతో వచ్చే మొట్టమొదటి చిప్సెట్.

దీనితో పాటు MT6739 HD + డిస్ప్లేకి సపోర్ట్  ఇస్తుంది, దీని రిజల్యూషన్ 1440 x 720 పిక్సెల్స్. ఇందులో డ్యూయల్ కెమెరా (13MP + 2MP) సపోర్ట్ ఉంది. ఇది ఫేస్ అన్లాక్ కి మద్దతిస్తుంది. దీనితో, మీడియా టెక్ ఒక వివరణాత్మక వివరణను చూపించింది, ఇది ఒక Android ఒరియో  (గో ఎడిషన్) లో ఉంటుంది. ఇది 1GB RAM మరియు 8GB స్టోరేజ్ , HD +డిస్ప్లే , 13MP మరియు 8MP కెమెరా వంటి ఫీచర్స్ ని  కలిగి ఉంది.

ఈ కొత్త చిప్సెట్ తో  పాటు, మీడియా టెక్ కూడా సెన్సియో MT6381 మొబైల్ డివైసెస్  కోసం ఒక కొత్త బయోసెన్సార్ మాడ్యుల్  ప్రవేశపెట్టింది. ఈ బయోసెన్సర్ హార్ట్ రేట్ , రక్తపోటు, ECG, PPG, SPO2 మరియు వయిటల్స్  లను మ్యాప్ చేయగలదు . ఈ కొత్త బయోసెన్సార్ను స్మార్ట్ఫోన్ల వంటి డివైసెస్ లో ఉపయోగించవచ్చు.

 

 

 

Connect On :