తాజాగా జరిగిన మైక్రోసాఫ్ట్ వరల్డ్ వైడ్ పార్ట్నర్ కాన్ఫిరేన్స్ లో మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ త్వరలో విండోస్ 10 OS తో కొత్త Lumia ఫోనులు మార్కెట్ లోకి వస్తాయి అని వెల్లడించారు. అలాగే ప్రతీ సంవత్సరం మైక్రోసాఫ్ట్ నుండి ఒకటి లేదా 2 మోడల్స్ బడ్జెట్, బిజినెస్, ప్రీమియం మరియు ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్లలో లాంచ్ చేస్తుంది అని కూడా అనౌన్స్ చేసింది కంపెని.
ఇందుకు సంబంధించి రెండు లూమియా ఫోనులు పై కంపెని 'Cityman' మరియు 'Talkman' అనే కోడ్ నేమ్స్ తో పనిచేస్తునట్టు రిపోర్ట్స్. ఇవి సరికొత్త ప్రీమియం డిజైనింగ్ తో ఉండనున్నాయని కంపెని చెబుతుంది. తాజాగా మైక్రోసాఫ్ట్ మొబైల్ బిజినెస్ లో కొన్ని కీలక మార్పులు చేస్తుంది అని చెప్పటం జరిగింది.
కొత్త os కారణంగా వస్తున్నవి కేవలం lumia కొత్త సిరిస్ మొబైల్స్ మాత్రమే కాదు, టాబ్లెట్స్, నోట్ బుక్స్, గేమింగ్ డివైజెస్ ను కూడా ప్రవేశ పెట్టనుంది కంపెని. అయితే ఓవర్ అల్ గా జరిగిన అనౌన్స్మెంట్స్ లో కంపెని ప్రత్యేకంగా "Premium Lumias" అని ప్రస్తావించటం వలన కొత్త లూమియా లతో కంపెని మళ్ళీ యూజర్స్ కు మంచి ఫోనులు తెస్తుందా అనే ఆశ పుడుతుంది.