Android Oreo మరియు Android 9 Pie కి అప్డేట్ కానున్న షావోమి ఫోన్ల గురించి తెలుసుకోండి!

Updated on 30-Oct-2018
HIGHLIGHTS

త్వరలో ప్రధాన ఆండ్రాయిడ్ కి అప్డేట్ అవనున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ప్రకటించిన షావోమి.

2018 నాలుగవ త్రైమాసికానికి,  ప్రధాన ఆండ్రాయిడ్ అయిన Android Oreo లేదా Android 9 Pie కి అప్డేట్ కానున్నఫోన్ల జాబితాని షావోమి తెలియచేసింది. ఆశాజనకంగా, OS యొక్క బీటా ముందుగా జాబితా చేయబడిన ఫోన్లలో అందించబడుతుంది, తరువాత ఈ 2019 ప్రధమార్ధానికల్లా ఇవి స్థిరమైన అప్డేట్ పొందుతాయి.  ఈ అప్డేట్ కానున్న జాబితా విషయానికి వస్తే, ముందుగా ఆండ్రాయిడ్ ఓరెయో ని, మి మిక్స్, మి మిక్స్2, మి నోట్ 2, మి నోట్ 3, రెడ్మి 5,రెడ్మి A, రెడ్మి 5ప్లస్, మి 5, మి 5s, మి 5s ప్లస్, మి 6, మి 8SE, మి 8 యూత్ ఎడిషన్, మి 8 స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఎడిషన్ మరియు మరికొన్ని ఇతర మోడళ్ళు అందుకోనున్నాయి. అల్లాగే, మి మిక్స్ 2S, మి 8, మి 8 ట్రాన్సపరేంట్ ఎక్సప్లోరేషన్ ఎడిషన్ వంటివి ఆండ్రాయిడ్ 9 ఫై అప్డేట్ పొందనున్నాయి.

పైన పేర్కొన్న వాటిలో కొన్ని మోడళ్ళు ఇప్పటికే వాటి తదుపరి ఆండ్రాయిడ్ వెర్షన్ తో నడుస్తున్నట్లు గమనించవచ్చు. తమ ఫోన్లు ఇప్పటికే రెండు మేజర్ అప్డేట్లను పొందినట్లు ఇతర అప్డేట్ పొందవని, షావోమి తెలియచేసింది. అధనంగా, పాత ఫోన్లు ఈ అప్డేట్లో భాగంగా ఉండబోవని కూడా షావోమి తెలియచేసింది, అయితే వాటి వివరాలను మాత్రం తెలియ చేయలేదు. తాజాగా విడుదల చేసిన Mi Mix 3 స్మార్ట్ ఫోన్ MIUI ఆధారితంగా Android 9 Pie తో నడుస్తుంది.

Mi Mix 3 స్మార్ట్ ఫోన్, స్నాప్ డ్రాగన్ 845 SoC ప్రాసెసెసర్ తో వస్తుంది మరియు 6GB,8GB లేదా 10GB గా ఎంచుకోగల ర్యామ్ మరియు 128GB లేదా 256GB  స్టోరేజి ఎంపికలతో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 93.4 బాడీ-టూ-స్క్రీన్ రేషియోగల ఒక 6.4 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ HDR డిస్ప్లే తో వస్తుంది. అయితే, స్టోరేజిని పెంచుకోవడానికి మరియు 3.5 mm ఆడియో జాక్ వంటి  వాటికీ  ఇందులో అవకాశం లేదు. ముందు 24MP+2MP కెమేరాని కలిగి ఉంటుంది.           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :