LG Band Play పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను కొరియా లో లాంచ్ చేసింది. దీని ధర 22,700 రూ. 5in HD డిస్ప్లే, క్వాడ్ కోర్ 410 ప్రొసెసర్, 2జిబి ర్యామ్ మరియు 16 ఇంబిల్ట్ మెమరి, 32 జిబి అదనపు మెమరి కెపాసిటీ దీనిలో ఉన్నాయి.
బ్యాండ్ ప్లే లో 13 MP లేజర్ ఆటో ఫోకస్ కెమేరా మరియు 5MP ఫ్రంట్ కెమేరాలు ఉన్నాయి. LG లాంచ్ చేసిన ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ అన్నీ చదివితే పెద్దగా ఇంప్రెసివ్ పాయింట్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే ఇవే స్పెసిఫికేషన్స్ 10,000 సుమారు ధరలో వేరే బ్రాండ్స్ లో లభిస్తున్నాయి. అయితే దీని సౌండ్ డిపార్ట్ మెంట్ మాత్రం హై లైట్ ఫీచర్స్ తో వస్తుంది. దీనిలో 1W స్పీకర్ జోడించింది LG. క్వాడ్ బీట్ 3 హెడ్ ఫోన్స్ తో వస్తుంది బ్యాండ్ ప్లే. LG G3 మోడల్ లో కూడా 1 Watt ఉంది.
WiFi n, బ్లూటూత్ 4.1, NFC , 2300 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 LG కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ మరియు సరి కొత్త 'Focus Mode' ఫీచర్ తో వస్తుంది బ్యాండ్ ప్లే. distractions ఏమీ లేకుండా సౌండ్ పై ఫోకస్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అయితే ఈ ఫోన్ ఇండియాలో ఉంటుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. 23K లకు ఇది కచ్చితంగా లో పవర్డ్ ప్రొసెసర్ తో వస్తుంది, కాని LG లేజర్ ఆటో ఫోకస్ మరియు 1Watt స్పీకర్ వంటి ఫీచర్స్ ను ఫోకస్ చేసినట్లు ఉంది. ఇక్కడ కొత్తవి పెట్టి, అక్కడ పాతవి పెట్టింది.