సెకెండరీ డిస్ప్లే తో LG V10 అఫిషియల్ అనౌన్స్

Updated on 01-Oct-2015
HIGHLIGHTS

దీనిలో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

చాలా రోజుల నుండి రూమర్స్ గా వినిపిస్తున్న స్మార్ట్ ఫోన్, LG V10. ఇప్పుడు కంపెని దీనిని అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. దీని ప్రత్యేకత, సెకెండ్ డిస్ప్లే.

5.7 in QHD క్వాంటమ్ డిస్ప్లే అండ్ 2.1 in సెకెండ్ డిస్ప్లే, దీని పేరు సెకెండ్ స్క్రీన్. ఇది కూడా ఫ్రంట్ సైడ్ ఉంటుంది కాని ప్రైమరీ స్క్రీన్ పైన ఉంటుంది.

 మీరు ప్రైమరీ స్క్రీన్ లో ఫుల్ స్క్రీన్ వీడియోస్ చూస్తున్నప్పుడు, సెకెండ్ స్క్రీన్ లో నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఫేవరేట్ యాప్స్ ను షార్ట్ కట్స్ గా పెట్టుకోగలరు.

సో, వాడుతున్న యాప్ ను మూసివేయకుండా మరొక యాప్ ఓపెన్ చేయనవసరం ఉండదు అని చెబుతుంది కంపెని. సెకెండ్ స్క్రీన్ లో always on ఫీచర్ కూడా ఉంది. అంటే టైమ్, weather, బ్యాటరీ లెవెల్ etc చూపిస్తుంది మెయిన్ డిస్ప్లే ఆఫ్ అయినా.

మరో హై లైట్.. సెపరేట్ లెన్స్ తో రెండు 5MP కేమేరాస్ ఉన్నాయి ఫ్రంట్ లో. 80 డిగ్రీ అండ్ 120 డిగ్రీ వైడ్ angle లో సేల్ఫీస్ తీసుకోవటానికి. అలానే లైవ్ వీడియో ఆప్షన్స్. అంటే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే, దానిలో ఎఫెక్ట్స్..ఆప్షన్స్ యాడ్ చేయగలరు.

HD, ఫుల్ HD, అల్ట్రా HD వంటి రికార్డింగ్ కేపబిలిటిస్ ఉన్నాయి వీడియో రికార్డింగ్ లో.

స్పెసిఫికేషన్స్ – స్నాప్ డ్రాగన్ 808 చిప్ సెట్ ప్రొసెసర్, 4gb LPDDR3 ర్యామ్, 16MP కెమెరా, 5MP డ్యూయల్ కెమెరా, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్,  2TB sd కార్డ్ సపోర్ట్.

3000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1.1 os, 4G LTE, 192 గ్రా బరువు తో ఇది సర్జరీస్ కోసం వాడే టూల్స్ లో ఉండే SAE గ్రేడ్ 316L స్టెయిన్ లెస్ స్టీల్ తో V10 ఫ్రేమ్ తయారు అయ్యింది.

 

 

 

Connect On :