10,990 రూ LG మాక్స్ ఫోన్ లాంచ్
ఆండ్రాయిడ్ లాలిపాప్, 5in డిస్ప్లే
సౌత్ కొరియన్ కంపెని, LG సరికొత్తగా బడ్జెట్ సెగ్మెంట్ లో ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు LG Max. ధర 10,990 రూ. LG లాంటి బ్రాండ్ ఈ ధరలో లాలిపాప్ తో 5in ఫోన్ లాంచ్ చేయటం బడ్జెట్ మార్కెట్ ఎంత డిమాండ్ గా ఉందో తెలుస్తుంది. LG గతంలో ఇంత కన్నా తక్కువలో ఫోనులు లాంచ్ చేసింది కాని స్టాండర్డ్ గా మంచి స్పెక్స్ తో ఇదే అనాలి.
LG మాక్స్ స్పెసిఫికేషన్స్ – 5in FWVGA(480 x 854 పిక్సెల్స్), 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, డ్యూయల్ సిమ్, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, మైక్రో sd కార్డ్ సపోర్ట్, 8MP మరియు 5MP కేమేరాస్, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1.1, 3G కనెక్టివిటి, బ్లూటూత్ 4.0, 2540 mah బ్యాటరీ. దీని బరువు 155 గ్రా.
ఈ ఫోనులో సేల్ఫీ కెమేరా కు కొన్ని అదనపు ఫీచర్స్ జోడించింది కంపెని. Gesture Shot ఆప్షన్ ద్వారా మీరు ఫోటో తీసుకోవటానికి ఫిజికల్ బటన్ క్లిక్ చేయనవసరం లేదు. Selfie Flash ఫీచర్ తో మీకు ఫ్రంట్ కెమేరా కు ఫ్లాష్ లేకపోయినా ఫోన్ స్క్రీన్ ను వైట్ బ్యాక్ గౌండ్ తో ఒక్కసారి ఫుల్ బ్రైట్ నెస్ తో వెలిగి లైట్ emit చేస్తుంది. అయితే దీని కన్నా తక్కువ బడ్జెట్ కు 2GB ర్యామ్ లు వస్తున్నాయి కనుక..డిస్ప్లే మరియు ర్యామ్ విషయాలలో మాత్రం కంపెని ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి