‘ఎల్ జి క్యూ8 (2018)’ ని స్టైలిష్ మరియు మిలటరీ – స్థాయి భద్రతా ప్రామాణికాలతో ఎల్ జి విడుదల చేసింది

Updated on 08-Aug-2018
HIGHLIGHTS

'ఎల్ జి క్యూ8 (2018)' ని ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో విడుదల చేసిన 'ఎల్ జి స్టైలస్ ప్లస్' ఫోన్ కి ఆధారంగా వుంది. ఈ ప్రధాన ఎలక్ట్రానిక్స్ దారు ఈ పేరును కొరియాలో తిరిగి ఉపయోగించింది.

 న్యూయార్క్ లో జరిగిన శామ్సంగ్ గెలాక్సీ యొక్క నోట్ 9  'అన్ ప్యాకెడ్' ఈవెంట్ కి కొంచెం ముందుగా, దాని దక్షిణ కొరియా పోటీదారు అయిన ఎల్ జి తన ఎల్ జి క్యూ8 (2018) ఫాబ్లేట్ ని ఒక స్టైలెస్ తో ప్రకటించింది. ఈ ఫోన్ తప్పనిసరిగా LG Q స్టైలస్ ప్లస్ యొక్క క్లోన్. సీనిని యూ ఎస్  లో కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఈ ఎల్ జి క్యూ8 (2018), గత సంవత్సరం శామ్సంగ్ గెలాక్సీ 8 నోట్ లో పరిచయం చేసిన స్క్రీన్ – రైటింగ్ ఫంక్షనాలిటీతో వస్తుంది . "పాప్ మెమో" తో వినియోగదారులు ఏ స్క్రీన్ నుండైనా తక్షణమే వ్రాయగలరు. కలరింగ్ బుక్ మరియు GIF క్రియేటర్తో సహా గెలాక్సీ నోట్ 8 లోవున్నకొన్ని ఎంపికలు ఇందులో  చేర్చబడినవి.  కొరియాలో 539,000 వన్ (సుమారు రూ. 33,000)గా వుంది మరియు కంపెనీ యొక్క 'Q- సిరీస్' లైనప్ లో దీన్ని తాజాగా జోడించబడింది.

 

 ఎల్ జి క్యూ8 (2018) ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ :

ఈ ఎల్ జి క్యూ8 (2018) బిల్ట్ – ఇన్ "స్టైలిష్ పెన్" తో వస్తుంది నోట్స్ లో సౌకర్యవంతంకోసం 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఒక 6.2-అంగుళాల ఫుల్-డిజైన్  గల ఫుల్ – హెచ్ డి+ డిస్ప్లే ఇందులో ఇవ్వబడింది. ఒక ఫ్రంట్ కెమేరా మరియు మందపాటి బెజల్లు ఫోన్లో ఉన్నాయి. వాల్యూమ్ రాకర్స్ ఎడమ అంచున ఉంటాయి మరియు పవర్ బటన్ కుడి వైపున ఉంటుంది. వెనుకవైపు, ఒక ఫ్లాష్ తో కూడిన ఒక కెమెరా మాడ్యూల్ ఉంది, మరియు వేలిముద్ర సెన్సార్ కెమెరా క్రింద కేంద్రీకృతమై ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగులలో ఇవ్వబడింది అవి : అరోరా బ్లాక్ మరియు మొరాకన్ బ్లూ.

యూ ఎస్ భద్రతా విభాగం ఉపయోగించే సైనిక భద్రతా ప్రమాణమైన 'MIL-STD 810G' కోసం ఈ ఫ్యాబ్;ఫాబ్లేట్ ఆమోదించబడింది మరియు ఈ డివైజ్ నీరు మరియు ధూళి నిరోధకతను కలిగి ఉండే IP68 రేటింగ్ తో వస్తుంది. షాక్, కంపనం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత, థర్మల్ షాక్ మరియు తేమతో సహా 14 వర్గాలలో స్మార్ట్ ఫోన్ పరీక్షించబడిందని LG పేర్కొంది మరియు వివిధ పరిసరాలలో స్థిరమైన పనితీరును అందచేసింది కూడా. ఎల్ జి క్యూ8 (2018) క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  450 ఆక్టా – కోర్ ప్రాసెసర్ చేత శక్తినివ్వబడి 4GBజీబీ  ర్యామ్  మరియు 64జీబీ  స్టోరేజి తో వస్తుంది.

ఈ ఫ్యాబ్లేట్ ఒక్క వెనుకవైపు వేగంగా దృష్టి పెట్టడంకి ఉపయోగపడే టెక్నాలజీ అయిన 'ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF)' తోకూడిన 16ఎంపీ కెమేరాని కలిగి వుంది, ఇది షార్ప్ షూటింగ్ కోసం ఉపయోగపడుతుంది. గూగుల్  లెన్స్ లాగా పనిచేసే 'Q లెన్స్' ఫీచర్ దీనిలో ఉంది. ఇది ఒక ఫోటోకి సంభందించిన విషయ విశ్లేషన చేస్తుంది మరియు ఇంటర్నెట్ లో సంబంధిత సమాచారాన్ని కనుగొంటుంది. ఇంకా గ్రూప్ పోర్ట్రైట్ తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న 5ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 

ఈ సంస్థ 'హాయ్-ఫై క్వాడ్ డాక్ ' సౌండ్ సాంకేతికతను కలిగి ఉంది, ఇది ఒరిజినల్ ధ్వనికి దగ్గరగా ఒక ఉత్పత్తిని విడుదల చేయాలని పేర్కొంది. DTS: X స్టీరియో సౌండ్ టెక్నాలజీ దాని మూలానికి  సంబంధం లేకుండా కంటెంట్ కి  స్టీరియోఫోనీ ని జతచేస్తుంది. ఈ టెక్నాలజీ వినియోగదారులకి అధిక స్థాయి ఇయర్ ఫోన్ లేకుండా కూడా 7.1 ఛానల్ ధ్వనిని ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. ఇంకా ఇది క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీతో 3300mAh బ్యాటరీ కలిగి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :