LG తన అధికారిక సైటు LG G4 ప్రీ బుకింగ్ అమ్మకాలను మొదలుపెట్టింది. రిపోర్ట్స్ ప్రకారం ధర సుమారు 50,000 రూ. ఉండవచ్చు. అఫీషియల్ లాంచ్ ఈవెంట్ రోజున అమితాబ్ బచ్చన్ చే మొబైల్ సేలేక్టేడ్ బయర్స్ కు ఇవ్వనుంది LG.
LG G3 ముందు మోడల్ ను LG గత సంవత్సరం విడుదల చేసింది. తాజాగా LG #tryLGG4 పేరుతో ఒక కేమ్పైన్ ను కూడా నడిపింది. దీనిలో కొంతమందికి LG G4 బీటా వెర్షన్ ను రిలీజ్ కు ముందు టెస్టింగ్ వాడుకకు ఇచ్చింది LG. G4 స్మార్ట్ ఫోన్ తో ఇప్పుడు LG 12,000 రూ. బెనిఫిట్స్ ను ఫ్రీగా ఇస్తుంది. 2000రూ. మెటాలిక్ బ్యాక్ ఫినిషింగ్ కవర్ , 6500 రూ. వన్ టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ మరియు చార్జింగ్ క్రాడిల్ తో 3,500 రూ. ఎక్స్ట్రా బ్యాటరీ ఈ ఫ్రీ బెనిఫిట్స్ లో ఉన్నాయి.
LG G4 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 5.5 in 538ppi QHD డిస్ప్లే, లాలిపాప్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్, x10 LTE ప్రాసెసర్, 16MP F1.8 LD ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ బ్యాక్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 3జిబి ర్యామ్, 32జిబి eMMC కార్డ్ మరియు 2 TB వరకూ మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకునే స్టోరేజ్ కెపాసిటీ. కనెక్టివిటి విభాగంలో LG G4 డ్యూయల్ సిమ్ , బ్లూటూత్ 4.1, usb 2.0, వైఫై 802.11 a/b/g/n/ac, A-GPS, Glonass, HDMI, స్లిమ్ పోర్ట్(4K) మరియు NFC ఉన్నాయి. 3,000 mah రిమూవబాల్ బ్యాటరీ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
అయితే LG G4 సామ్సంగ్ S6, HTC M9, సోనీ ఎక్స్పిరియా Z4 మరియు ఆపిల్ అప్ కమింగ్ మోడల్ కు మంచి పోటీ ఇస్తుంది. అయితే ధర విషయంలో కొంచెం కంపెని కాంప్రమైజ్ అయితే LG G4 కు నిజంగా మంచి మార్కెట్ వస్తుంది. ఒక ముంబాయి రిటేలర్ అప్డేట్ ప్రకారం G4 ధర 51,000 రూ. ఉండనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, ఒక ఈ కామర్స్ వెబ్ సైటు దీనిని 49,000 రూ లకు సైటు లో లిస్టు చేసింది.