LG G 2 ప్యాడ్ లాంచ్

LG G 2 ప్యాడ్ లాంచ్
HIGHLIGHTS

రీడింగ్ మోడ్ మరియు 2gb ర్యామ్ ప్రత్యేకతలు

సౌత్ కొరియన్ కంపెని, LG టాబ్లెట్ డివైజ్ గా పిలుచుకునే LG G 2 ప్యాడ్ ను లాంచ్ చేసింది. దీని పేరు LG G 2 ప్యాడ్ 10.1. ఇది వచ్చే నెల బెర్లిన్ లో విడుదల అవుతుంది.

దీనిలో ప్రధానంగా రీడర్ మోడ్ ను జోడించింది కంపెని. అంటే ఇది డిజిటల్ రీడింగ్(e-Reader) కోసం ప్రత్యేకంగా ఇంటరెస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. డిస్ప్లే లో వెనుక నుండి వచ్చే బ్లూ లైటింగ్ ను తగ్గిస్తుంది LG G2 ప్యాడ్.

స్పెసిఫికేషన్స్ – 10.1 in 1920 x 1200 పిక్సెల్స్ 224PPi డిస్ప్లే, 2.26 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 800 ప్రొసెసర్, 2gb ర్యామ్, 5MP రేర్ అండ్ 2mp ఫ్రంట్ కెమరాస్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 4G, 7400 mah బ్యాటరీ, 489 గ్రా బరువు(చాలా ఎక్కువ),  ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్.

దీని ధర ఇంకా కంపెని వెల్లడించలేదు కాని యూరోప్ దేశాలతో పాటు ఇండియా మార్కెట్ లో కూడా విడుదల కానుంది. అయితే స్క్రీన్ సైజ్ బాగా పెద్దదిగా ఉంది. డ్యూయల్ విండో మోడ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రీ లోడెడ్ యాప్స్, ఒక సంవత్సరం 100 gb one drive స్టోరేజ్ ఫ్రీ వంటి అదనపు ఆకర్షణలతో వస్తుంది.

ఆధారం: LG న్యూస్ రూమ్

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo