స్మార్ట్ ఫోన్ లో 1gb ర్యామ్ ఇప్పటి అప్లికేషన్స్ కు సరిపోదు, 2gb ర్యామ్ మంచి కాన్ఫిగ్, 3gb ర్యామ్ ఉంటే బ్రిలియంట్ అనాలి. అయితే ఆసుస్ మరియు oneplus ఇంకాస్త ముందుకు వెళ్లి 4gb ర్యామ్ ను తీసుకు వచ్చారు.
ఇప్పుడు కొత్తగా చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, LeTV బ్రాండ్ నుండి 6gb ర్యామ్ ఉండే స్మార్ట్ ఫోన్ వస్తుంది. LeTV Le max 2 అనే మోడల్ లో కంపెని 6gb ర్యామ్ పెట్టింది. ఇది త్వరలోనే చైనా లో రిలీజ్ కానుంది కూడా.
కేవలం అంత హై ర్యామ్ మాత్రమే కాకుండా.. 360 డిగ్రీ రొటేటింగ్ కెమేరా కూడా ఉంది అని రూమర్స్. ఇది స్నాప్ డ్రాగన్ 820 SoC పై రన్ అవుతుంది. ఈ ప్రొసెసర్ తో ఇదే మొదటి ఫోన్. 2.5D curved డిస్ప్లే కూడా ఉంది.
LeTV మనకు వినటానికి చాలా కొత్త పేరులా అనిపిస్తుంది కాని చైనా లో ఇది కంటెంట్ ఉన్న బ్రాండ్ అని పేరు తెచ్చుకుంది. USB టైప్ c పోర్ట్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా వీళ్ళదే. ఇలా చూస్తే LeTV కంపెని అన్నీ మొదటి సారిగా చేయటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఉంది.