లెనోవో zuk అనే కంపెని ను కొనటం గురించి గత వారం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే బ్రాండ్ నుండి transparent డిస్ప్లే ఉన్న prototype స్మార్ట్ ఫోన్ బయటకు వచ్చింది. ఇది మొదటిగా Gizmo చైనా వెబ్ సైటు లో పోస్ట్ అయ్యింది.
zuk లెనోవో బ్రాండింగ్ నుండి విడుదల అయ్యే మొబైల్స్ కేవలం ఆన్ లైన్ లోనే సేల్ అవుతాయి. మొదటిగా zuk z1 పేరుతో మోడల్ చైనా లో రిలీజ్ అయ్యింది. అదే ఈవెంట్ లో కంపెని ఒక transparent డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రదర్శించింది. దీని పేరు ఇంకా తెలియదు. ఇది z1 మోడల్ మాత్రం కాదు.
ఇది సాధారణ స్మార్ట్ ఫోన్ ఎలా పనిచేస్తుందో అలానే కాల్స్, మ్యూజిక్..etc అన్నీ ఆండ్రాయిడ్ os పైనే పనిచేస్తుంది. కాకపోతే హై లైట్ ఏంటంటే డిస్ప్లే మాత్రం transparent. ఇది prototype మోడల్ కాబట్టి..ఇప్పట్లో మార్కెట్ లోకి రావటం జరగదు.
మినిమమ్ రెండు సంవత్సరాలు పట్టవచ్చు. దానికి తోడూ.. transparent డిస్ప్లే లను తయారు చేయటానికి ఇప్పుడు టెక్నాలజీ అంత అందుబాటులో కూడా లేదు.
లెనోవో zuk z1 మొదటి స్మార్ట్ ఫోన్ 4,100 mah బ్యాటరీ 13MP సోనీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, usb type c పోర్ట్ తో 18,200 రూ లకు చైనా మార్కెట్ లో సేల్ అవుతుంది. అయితే zuk z1 ఇండియన్ మార్కెట్ లోకి వస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఎటువంటి న్యూస్ లేదు.
ఇమేజ్ ఆధారం: weibo, Gizmo China