ఇండియాలో 4000 mah బ్యాటరీ తో Lenovo vibe K6 పవర్ స్మార్ట్ ఫోన్

ఇండియాలో 4000 mah బ్యాటరీ తో Lenovo vibe K6 పవర్ స్మార్ట్ ఫోన్

ఇండియాలో K సిరిస్ లో next స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు రెడీ గా ఉంది lenovo. అప్ కమింగ్ K సిరిస్ ఫోన్ ఏంటో guess చేయగలరా అని అడుగుతుంది. నంబర్ ప్రకారం ఇది K6 అవుతుంది.

కంపెని స్వయంగా ట్విటర్ లో teaser రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఇండియాలో లెనోవో K5 నోట్ ఉంది. సో ఇది K6 పేరుతోనే వస్తుంది. అదనంగా ఒక పవర్ అని హింట్ ఇవటంతో ఇది ఆల్రెడీ 2016 గ్లోబల్ IFA ఈవెంట్ లో చూపించిన లేనోనో Vibe K6 పవర్ అని క్లియర్ గా తెలుస్తుంది.

ఇది "Kickass Power" తో రానుంది అని హింట్ తెలిపింది కంపెని. అంటే Xiaomi మాదిరిగా లెనోవో కూడా 4000 mah పవర్ బ్యాటరీ తో ఫోన్ లాంచ్ చేయనుంది.

పోస్ట్ చేసిన దాని వివరాలు అలా ఉంచితే..ఆల్రెడీ గ్లోబల్ గా IFA లో రిలీజ్ అవటం వలన ఫోన్ స్పెక్స్ కూడా తెలుసు. దీనిలో డ్యూయల్ సిమ్,  5 in ఫుల్ HD డిస్ప్లే, 2GB/3GB రామ్స్,

16/32GB స్టోరేజెస్, 4000 mah బ్యాటరీ, 13MP/8MP కేమేరాస్, 4G LTE, మెటల్ unibody, ఫింగర్ ప్రింట్ స్కానర్, 64 bit స్నాప్ డ్రాగన్ 430 ఆక్టో కోర్ ప్రొసెసర్, SD కార్డ్ సపోర్ట్ ఉండనున్నాయి.

అయితే లెనోవో IFA బెర్లిన్ ఈవెంట్ లో K6 అండ్ K6 నోట్ ను కూడా ప్రవేశపెట్టింది. సో ఈ స్పెక్స్ అటూ ఇటూ చిన్న పాటి మార్పులు కూడా జరిగే అవకాశాలున్నాయి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo