మోటోరోలా బ్రాండ్ ను లెనోవో కొన్న తరువాత లెనోవో మొబైల్స్ ను మోటోరోలా బ్రాండ్ లోకి కలపటం జరిగింది. అంటే లెనోవో లోని సిరిస్ లను మోటోరోలా లోని సబ్ సిరిస్ లను కలిపి కొన్ని కీలకమైన మార్పులు చేస్తుంది లెనోవో.
ఈ మార్పుల భాగంలోనే లెనోవో vibe సిరిస్ ను ఇక కంప్లీట్ గా ఆపివేయనుంది అని రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. వైబ్ సిరిస్ లో కంపెని మిడ్ నుండి హై ఎండ్ ర్యాంజ్ ఫోన్స్ ను రిలీజ్ చేసింది ఇంతవరకూ.
లేటెస్ట్ గా P1 అండ్ P1M మోడల్స్ కు లాంచ్ అయ్యాయి. కాని రీసెంట్ లెనోవో ప్రెసిడెంట్ ఒక మీడియా ఇంటర్వ్యూ లో vibe మోడల్స్ ను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.
లెనోవో కు Lemon, Vibe అండ్ మోటోరోలా సబ్ బ్రాండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు vibe కు బదులు లెమన్ సబ్ సిరిస్ లో ఫోన్స్ రానున్నాయి అని తెలుస్తుంది.
లెనోవో K3 నోట్ లెమన్ సబ్ బ్రాండింగ్ లోనిదే. అయితే vibe ను తొలిగించటానికి ప్రధమ కారణం మోటోరోలా ను కంప్లీట్ గా లెనోవో లోకి జత చేసి, మోటో సబ్ బ్రాండ్ లో మిడ్ నుండి హై ఎండ్ బడ్జెట్ మోడల్స్ మార్కెట్ లో ప్రవేసపెట్టడమే.