Phab Plus పేరుతో లెనోవో కొత్తగా 6.8 in డిస్ప్లే కలిగిన ఫాబ్లేట్ డివైజ్ ను రిలీజ్ చేసింది నిన్న. దీని ధర చైనా కరెన్సీ ప్రకారం 27,000 రూ. దీని availability పై ఇంకా ఎటువంటి విషయాలు వెల్లడించలేదు లెనోవో.
స్పెసిఫికేషన్స్ – 6.8 in 324PPi FHD డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 SoC , అడ్రెనో 405 GPU, 2gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, అదనపు స్టోరేజ్ సదుపాయం. కేవలం మోడల్ ను రిలీజ్ చేసింది కాని ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది, ఇండియన్ ప్రైస్ ఎంత ఉంటుంది, ముందుగా ఏ దేశంలో లాంచ్ అవుతుంది..అనేవి ఇంకా తెలియవలసి ఉంది.
13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 3500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0, vibe యూజర్ ఇంటర్ఫేస్, డాల్బీ atmos సరౌండ్ సౌండ్ ఆడియో క్వాలిటీ, డ్యూయల్ సిమ్ 4G LTE. 7.6mm సన్నగా ఉంటుంది.
సౌత్ ఇండియాలో ప్లాంట్ కూడా నెలకొల్పింది కాబట్టి, మోడల్ ను ఇండియన్ మార్కెట్ కు తీసుకువస్తుంది కాని ప్రైస్ తగ్గించి విడుదల చేయాలి ఇండియన్ మార్కెట్ కు అనుగుణంగా.. ఎందుకంటే లేనోనో ఇక్కడ సక్సెస్ అవ్వటానికి కారణం దాని బడ్జెట్ డివైజెస్ బిజినెస్ మోడల్, హై ఎండ్ మోడల్స్ కాదు.