లెనోవో జస్ట్ మీడియా కు ఇన్వైట్స్ పంపడం జరిగింది. ఇన్వైట్ లో "save the date. 5 Jan" అని మెసేజ్ కూడా తెలియజేసింది.
సో కంపెని మోస్ట్ మోస్ట్ మార్కెటింగ్ స్మార్ట్ ఫోన్ నోట్ K4 ఈ డేట్ లో లాంచ్ అవుతుంది అని స్పష్టం అయ్యింది. అయితే 3 విషయాలు తప్ప ఇందులో ఏమి స్పెక్స్ ఉన్నాయో బయటకు రాలేదు ఇంకా.
K4 నోట్ పై ఇప్పటివరకు కంపెని వివిధ రకాల ఇమేజెస్ అండ్ హింట్స్ పోస్ట్ చేసింది. వాటిలో తెలిసిన విషయాలు.. K4 నోట్ మెటాలిక్ ఫ్రేం తో వస్తుంది.
అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 3gb ర్యామ్ స్పెసిఫికేషన్ తో రానుంది. 3 gb ర్యామ్ లో పెద్దగా సర్ప్రైస్ ఏమి లేదు (కూల్ ప్యాడ్ నోట్ 3 8,999రూ లకు ఉంది) కాని బడ్జెట్ లో ఇంతకుమించి ఆశించటం కూడా కరెక్ట్ కాదు.
ఎందుకంటే 4gb ర్యామ్ తోనే ఇప్పుడు హై ఎండ్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 4gb ను బడ్జెట్ లో దించితే వేరే బ్రాండ్స్ సంగతి పక్కన పెట్టండి, లెనోవో లోనే మిడ్ లేదా హై బడ్జెట్ హ్యాండ్ సెట్స్ సేల్స్ పడిపోతాయి.