ఇండియాలో లెనోవో నుండి 4GB రామ్ తో MOTO M ఫోన్: అఫీషియల్
లెనోవో నుండి ఇండియాలో కొత్త MOTO ఫోన్ వస్తుంది. లెనోవో నుండి మోటోరోలా ఫోన్ ఏంటి అనుకునే వారికి మరొక సారి – మోటోరోలా ను లెనోవో కొనటం జరిగింది.
కంపెని అఫీషియల్ గా కొత్త MOTO ఫోన్ గురించి teaser రిలీజ్ చేసింది. అయితే గతంలో మోటోరోలా నుండి MOTO M అనే ఫోన్ ఇండియాలోకి వస్తున్నట్లు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి.
సో లెనోవో ఈ రోజు tease చేసిన ఫోన్ MOTO M అయ్యుంటుంది అని అంచనా. క్రింద లెనోవో పెట్టిన teaser tweet చూడగలరు. పోస్ట్ లో ఫోన్ యొక్క వెనుక ఇమేజ్ కూడా ఉంది.
అయితే ఇది ఫోన్ చైనాలో ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో అక్కడి కరెన్సీ ను ఇండియన్ rupees లోకి కన్వర్ట్ చేస్తే ఇండియాలో చైనాలో MOTO M 19,900 రూ లకు రిలీజ్ అయ్యింది.
స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో 5.5 ఫుల్ HD డిస్ప్లే, మీడియా టెక్ 2.2GHz P15 ఆక్టో కోర్ ప్రొసెసర్, 4GB రామ్, 3050 mah బ్యాటరీ, 32GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్..
16MP రేర్ కెమెరా with PDAF, 8MP ఫ్రంట్ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్, డాల్బీ atmos ఆడియో సపోర్ట్ ఉన్నాయి moto M లో. ఈ ప్రైస్ లో ఆల్రెడీ 4GB రామ్ తో లెనోవో ZUK ఫోన్ ఇండియాలో సేల్స్ అవుతుంది.
Something different is coming your way. Stay tuned to know more. #ComingSoon pic.twitter.com/nmqT9p6FO5
— Moto India (@Moto_IND) November 28, 2016