లెనోవో సరికొత్త డిజైన్ తో ఒక స్మార్ట్ వాచ్ ను బీజింగ్ లో జరగుతున్న లెనోవో టెక్ షో లో విడుదల చేసింది. దీనికి మ్యాజిక్ వ్యూ అనే పేరు ను పెట్టింది లెనోవో. దీని ప్రత్యేకత సెకెండరి డిస్ప్లే. ఇది యూజర్స్ ఇన్ఫర్మేషన్ మరియు నోటిఫికేషన్స్ ను ప్రైవేట్ గా ఉంచేందుకు అట.
అయితే వాచ్ స్ట్రాప్ పై ఉండే సెకెండ్ స్క్రీన్ మీరు మీ కంటి దగ్గర పెట్టి చూసుకుంటే కాని కనిపించదు. స్క్రీన్ 20 రెట్లు ఫస్ట్ స్క్రీన్ కన్నా పెద్దది అయినా ఇది అందరికి కనిపించదు. ఆప్టికల్ రిఫ్లెక్షన్ తో దీనిని తయారు చేసారు. సెకెండ్ డిస్ప్లే లో మ్యాప్స్, వీడియోస్, ఇమేజెస్ కూడా చూసుకునే సౌలభ్యం ఉంది, ఇది ఆండ్రాయిడ్ వేరేబల్స్ ఆదారిత కష్టమ్ ఓస్ పై పనిచేస్తుంది.
దీనితో పాటు లెనోవో స్మార్ట్ కాస్ట్ అని పిలిచే స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేసింది. దీని ప్రత్యేకత బిల్ట్ ఇన్ వర్చ్యువల్ కీబోర్డ్ ప్రొజెక్టర్ మాడ్యుల్. హాండ్ సెట్ పై భాగంలో లేసర్ ప్రొజెక్టర్ ను పొందిపరిచింది లెనోవో. ఇది ఇమేజెస్ మరియు వీడియోస్ ను వాల్స్ లేదా ప్రొజెక్టర్ స్క్రీన్స్ పై చూపిస్తుంది. ఇన్ఫ్రారెడ్ మోషన్ సెన్సార్ డిటెక్టర్ మరియు ఫోన్ ను టచ్ చేయకుండా చేతితో కంట్రోల్ చేయగలిగే ఫీచర్ ను జోడించింది లెనోవో. ఇది మెసేజెస్ టైప్ చేయటానికి, గేమ్స్ ఆడేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఒక వర్చ్యువల్ పియానోను ప్లే చేస్తూ లెనోవో ఈవెంట్ లో ప్రదర్సన ఇచ్చింది.
ఈ రెండితో పాటు లెనోవో మీడియా స్ట్రీమింగ్ డివైజ్ ను విడుదల చేసింది ఈవెంట్ లో. దీని ధర 49 డాలర్లు. ఇది గూగల్ క్రోమ్ కాస్ట్ కు పోటిగా ఉండనుంది. ఇది మీ ఆండ్రాయిడ్ , విండోస్ మరియు ఐఓస్ డివైజ్ నుండి వైర్ లెస్ గా కంటెంట్ ను స్ట్రీమింగ్ చేయనుంది. లెనోవో కాస్ట్ మిరాకస్ట్, DLNA, గూగల్ కాస్ట్ స్టాండర్డ్ ను సపోర్ట్ చేస్తుంది.
ఆధారం: ఆండ్రాయిడ్ సెంట్రల్