లెనోవో నుండి Phab 2 pro tango project ఫోన్ వస్తుంది అని ఇంతకముందే తెలుసుకున్నాము కదా. నిన్న రాత్రి ఈ ఫోన్ ను అఫీషియల్ గా SanFrancisco లో రిలీజ్ చేసింది కంపెని. ఇండియన్ మార్కెట్ రిలీజ్ డేట్స్ ఇంకా వెల్లడికాలేదు.
Tango project అనేది depth, ఏరియా, అండ్ మోషన్ sensors తో డివైజెస్ ను తయారు చేసే గూగాల్ ప్రాజెక్ట్. PHAB 2 Pro తో పాటు Phab2 Plus అండ్ Phab 2 కూడా వస్తున్నాయి.
ఇది AR ఎక్స్పీరియన్స్ తెచ్చే ప్రాజెక్ట్ ఫోన్. augmented reality(AR) అనేది మీరు ఉన్న ప్రదేశంలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ ను అనుసంధానం చేసి కొత్త Live ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. Virtual Reality(VR) అనేది కుత్రిమ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది.
Phab 2 Pro లో స్నాప్ డ్రాగన్ 652 ప్రొసెసర్, DSP, ISP modules అండ్ integrated sensor hub ఉన్నాయి. ఇవి augmented reality ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి.
Dolby ఆడియో TM అండ్ capture 5.1 dolby atmos playback capabilities, triple-array microphones, 16MP రేర్ కెమెరా ఉన్నాయి.
డిస్ప్లే 6.4 in intelligent assertive 2560×1440 పిక్సెల్స్ తో వస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 4050 mah బ్యాటరీ. ప్రైస్ – 33,000 rs సుమారు.
PHAB 2 ప్లస్ లో రెండు 13MP Fujitsu Milbeaut ఇమేజ్ సిగ్నల్ ప్రొసెసర్ రేర్ కెమెరాస్, AR effects, 8MP ఫ్రంట్ కెమెరా, 6.4 in FHD 2.5D curved గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ MTK 8783 ఆక్టో కోర్ SoC, 3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, triple-array మైక్రో ఫోన్ setup, 5.1 Dolby atmos surround with JBL earphones. దీని ప్రైస్ – 19,000 రూ సుమారు.
PHAB 2 లో AR కెమెరా, 6.4 in HD డిస్ప్లే, మీడియా టెక్ MTK 8735 ఆక్టో కోర్ SoC, 3GB ర్యామ్, 32GB ఇంటర్నెల్ స్టోరేజ్, 13MP PDAF రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, Dolby Atmos అండ్ డాల్బీ ఆడియో capture 5.1 ఫర్ వీడియోస్. దీని ప్రైస్ 14,000 సుమారు.
టోటల్ 3 ఫోనులు Champagne గోల్డ్ అండ్ Gunmetal గ్రే కలర్స్ లో ఆండ్రాయిడ్ 6.0 పై హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ తో వస్తున్నాయి.