లెనోవో నుండి కొత్తగా గూగల్ Tango స్మార్ట్ ఫోన్ వస్తుంది అని గతంలో చెప్పటం జరిగింది. ఇది ఈ రోజు నుండి సేల్ అవుతుంది కంపెని అఫీషియల్ సైట్ లో.
పేరు Phab 2 Pro. దీనిలోని ప్రత్యేకత – augmented రియాలిటీ కలిగి ఉండటం. ఈ సెట్ అప్ తో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఇది గూగల్ ప్రాజెక్ట్(Tango). దీనిని బాగా అర్థంచేసుకోవటానికి క్రింద కంపెని ప్రోమో వీడియో చూడగలరు…
augmented reality అనేది గేమింగ్ మరియు కొన్ని అవసరమైన విషయాలలో ఉపయోగపడే టెక్నాలజీ. 3D కెమెరా సిస్టం, depth sensing వంటి ఫీచర్స్ ఉంటాయి.
ఇతర జనరల్ స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో 6.4 in Quad HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 652 ప్రొసెసర్, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ with SD కార్డ్ సపోర్ట్.
4050 mah బ్యాటరీ, 16MP రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ప్రైస్ 499$(సుమారు 33 వేలు). ప్రస్తుతం US వెబ్ సైట్ లోనే సేల్స్ కు అందుబాటులో ఉంది. ఫోన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అఫీషియల్ సైట్ నుండి తెలుసుకోగలరు.