ఇండియాలో 11,999 రూ స్టార్టింగ్ ప్రైస్ తో రెండు స్మార్ట్ ఫోనులను లాంచ్ చేసిన లెనోవో

Updated on 02-Aug-2016

లెనోవో నుండి నిన్న ఇండియాలో Vibe K5 Note స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 3GB ర్యామ్, మరొకటి 4GB ర్యామ్.

రెండూ వేరియంట్స్ లో 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. 3GB వేరియంట్ ప్రైస్ 11,999 రూ, 4GB వేరియంట్ ప్రైస్ – 13,499 రూ. flipkart లో మాత్రమే ఆగస్ట్ 4 నుండి సేల్స్ స్టార్ట్.

విచిత్రం ఏమిటంటే దీనికి ముందు మోడల్ అయిన లెనోవో Vibe K4 నోట్ ఇదే ఇయర్ జనవరి లోనే రిలీజ్ అయ్యింది. అయితే ఇదే Vibe K5 నోట్ చైనా లో 2GB రామ్ తో రిలీజ్ అయ్యింది, జనవరి లో.

ఇక Vibe K5 నోట్ ఫీచర్స్ విషయానికి వస్తే…5.5 in FHD డిస్ప్లే, మీడియా టెక్ 1.8GHz Helio P10 SoC, 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0.

ఫింగర్ ప్రింట్ స్కానర్ on బ్యాక్ సైడ్, ధియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫర్ VR హెడ్ సెట్, డాల్బీ atmos ఆడియో, wolfson WM8281 ఆడియో codec.

దీనితో పాటు Vibe K5 ప్లస్ అనే మోడల్ కు అప్ గ్రేడ్ వేరియంట్ ను రిలీజ్ చేసింది కంపెని ఇండియాలో. పాత దానిలో 2GB ఉంటే అప్ గ్రేడ్ వేరియంట్ లో 3GB ర్యామ్ ఉంది. కొత్త UI, SD కార్డ్ సపోర్ట్ 128GB మాత్రమే change. కాని ప్రైస్ same ప్లస్ లానే.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :