కొన్ని రోజుల నుండి బాగా ప్రచారం అయిన లెనోవో K3 నోట్ ఈ రోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని ధర, 9,999 రూ. షార్ట్ టైమ్ అంచనాలకు ఇది 10,000 రూ సెగ్మెంట్ లో మంచి ఫోన్ లా అనిపిస్తుంది.
Lenovo K3 నోట్ స్పెసిఫికేషన్స్ – 5.5 ఇంచ్ FHD స్క్రీన్ , ఆక్టో కోర్ 64 బిట్ మీడియా టెక్ 6572 ప్రొసెసర్, 2జిబి ర్యామ్, Mali GPU, 13MP బ్యాక్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 16 జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 32జిబి వరకూ మైక్రో SD కార్డ్ సపోర్ట్, 4G LTE, ఆండ్రాయిడ్ లాలిపాప్, 3000 mah బ్యాటరీ. ఇది 2015 మార్చ్ నెలలో ఇంతకముందే చైనా లో రిలీజ్ అయ్యింది.
సాధారణంగా ఇప్పటి వరకూ ఉన్న మార్కెట్ ప్రకారం ఈ స్పెసిఫికేషన్లు 15K బడ్జెట్ లోపు దొరికే స్మార్ట్ ఫోన్స్ లో ఉంటాయి. కాని లెనోవో K3 నోట్, 10,000 రూ లకు లాంచ్ చేసి మొత్తం కాంపిటేషన్ ను మార్చివేసింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో దీనిని జులై 8న ఫ్లాష్ సేల్ లో కొనగలరు. ముందుగా ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోవాలి.