నిన్న చైనా లో లెనోవో Vibe X3 మోడల్స్ లాంచ్ అయ్యాయి. 19,500 రూ మోడల్ యూత్ వేరియంట్, 26,000 రూ కు 32gb స్టోరేజ్, 31,000 రూ లకు 64gb ఇంబిల్ట్ స్టోరేజ్ మోడల్ వస్తున్నాయి.
ప్రస్తుతం ఇవి చైనా లో ప్రీ ఆర్డర్స్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ పై స్పష్టత లేదు ఇంకా. X3 యూత్ లో 2gb ర్యామ్, 1.3GHz మీడియా టెక్ octocore,16gb స్టోరేజ్, 13MP అండ్ 5MP కెమేరాస్, 3400 mah బ్యాటరీ ఉన్నాయి. మిగిలిన రెండు x3 వేరియంట్స్ లో కేవలం ఇంబిల్ట్ స్టోరేజ్ ఒకటే తేడా.
Vibe x3 వేరియంట్స్ లో హై బ్రిడ్ సిమ్ స్లాట్స్ ఉన్నాయి. అంటే sd కార్డ్ కు సెకెండ్ సిమ్ కు ఒకే స్లాట్ ఉంటుంది. ఏదో ఒకటే(2nd సిమ్ లేదా sd కార్డ్) use అవుతుంది ఒకసారి. వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.
X3 స్పెక్స్ – 5.5 in 1080 x 1920 పిక్సెల్స్ 401PPi కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3gb ర్యామ్, 4G, 1.2GHz స్నాప్ డ్రాగన్ 808 64 bit hexacore ప్రొసెసర్, 32/64gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 21MP సోనీ IMX230 led ఫ్లాష్ phase డిటెక్షన్ ఆటో ఫోకస్(PDAF), 8MP ఫ్రంట్ కెమేరా, 3600 mah బ్యాటరీ.