లెనోవో K5 నోట్ పేరుతో చైనా లో ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి రానుంది. అఫీషియల్ గా కంపెని K5 నోట్ ను వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
చైనాలో దీని ప్రైస్ 11,350 రూ. ఇండియాలో K4 నోట్ రిలీజ్ అయిన కొన్ని వారాలలోనే అక్కడ ఈ మోడల్ రిలీజ్ అయ్యింది. అయితే ఇది Vibe K4 నోట్ కు అప్ గ్రేడ్ మోడలా కాదా అనేది లాంచ్ రోజే స్పష్టమవుతుంది, ఎందుకో క్రింద స్పెక్స్ చుస్తే తెలుస్తుంది..
చైనీస్ వేరియంట్ K5 నోట్ లో ఉన్న స్పెక్స్ విషయానికి వస్తే.. 2GB రామ్, 5.5 in FHD డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 4G, 13MP డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా,
8MP ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ Helio P10 1.8GHz SoC, 16GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1, 3500mah బ్యాటరీ ఉన్నాయి.