ఇండియన్ మార్కెట్ ను ప్రధానంగా ఇండియాలో లెనోవో అప్ కమింగ్ నోట్ 3 మోడల్ రిలీజ్ కానుంది జనవరి లో. దీనికి సంబంధించి కంపెని నిన్న రాత్రి టిసర్ ఇమేజ్ పోస్ట్ చేసింది.
ట్విటర్ users ను లెనోవో K4 నోట్ లో ఎంత ర్యామ్ ఉండనుంది అని అడుగుతూ ఈ ఇమేజ్ పోస్ట్ చేయబడింది. అయితే ఇమేజ్ చూసిన వారు ఎవరైనా చెప్పగలరు నోట్ 4 లో కంపెని 3gb ర్యామ్ ఇవనుంది అని.
ప్రస్తుతం హై ఎండ్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో 4gb ర్యామ్ highest ర్యామ్. సో మిడ్ ర్యాంజ్ లో 3gb ర్యామ్ ను తీసుకువస్తుంది లెనోవో. ఈ బడ్జెట్ లో 4gb తీసుకువస్తే మరే ఇతర హై బడ్జెట్ లోని లెనోవో డివైజెస్ ఎవరూ కొనరు.
సో 3gb ర్యామ్ మంచి ఆప్షన్ అని చెప్పాలి. 4gb కన్నా పెద్ద ర్యామ్ లు వస్తే, బడ్జెట్ హాండ్ సెట్స్ లో 4gb ర్యామ్ ను expect చేయవచ్చు.
గతంలో చేసిన టిసర్ ఇమేజెస్ ప్రకారం ఇది మెటాలిక్ ఫ్రేమ్, రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియా టెక్ Helio X10 ప్రాసెసర్ తో రానుంది. 2015 జూన్ లో లాంచ్ అయిన K3 నోట్ కు ఇది అప్ గ్రేడ్ మోడల్ అవుతుంది.