లాంచ్ అయిన దగ్గరనుండి అందరినీ ఆకర్షించింది లెనోవో K3 నోట్. కారణం దాని బడ్జెట్ అండ్ స్పెక్స్. దీని ధర 9,999 రూ. ఇప్పటివరకూ ఫోన్ ఫ్లాష్ సేల్స్ ద్వారా సేల్ అయ్యింది ఫ్లిప్ కార్ట్ లో. ఈ రోజు 5th ఫ్లాష్ సేల్ జరుపుకుంటుంది లెనోవో.
కంపెని independence డే సందర్భంగా ఆగస్ట్ 10 న ఓపెన్ సేల్స్ ను స్టార్ట్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్ సేల్ అవుతాయి ఓపెన్ గా. ప్రస్తుతం ఈ ఫోన్ కు పోటీగా యురేకా ప్లస్ ఉంది. 1000 రూ ధర తగ్గటంతో యురేకా ఇంకా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది K3 నోట్ కు.
లెనోవో K3 నోట్ స్పెసిఫికేషన్స్ తెలియని వారికి మరొకసారి.. మీడియా టెక్ MT6752 64 బిట్ ఆక్టో కోర్ 1.7 GHz SoC ప్రొసెసర్, 2 gb ర్యామ్, 5.5 in 1080P IPS డిస్ప్లే , 5 ఫింగర్ టచ్ సపోర్ట్, 16GB ఇంబిల్ట్ అండ్ 32 GB sd సపోర్ట్, 13 MP(డ్యూయల్ LED, ఆటో ఫోకస్) మరియు 5MP కేమేరాస్
యురేకా ప్లస్ 8,999 రూ లకు 1080P డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, Cyanogenmod 12 OS(దీనిలో స్టాక్ ఆండ్రాయిడ్ లో లేని కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ ఉంటాయి). లెనోవో k3 నోట్ లాలిపాప్ పై vibe ui 2.0 మీద రన్ అవుతుంది.