జూన్ 25 న లెనోవో K3 నోట్ లాంచ్
5.5 in స్క్రీన్, 3,000 mah బ్యాటరీ. 10 వేల లోపు ధర ఉంటుంది.
తాజాగా విడుదలైన లెనోవో A6000 మరియు A6000 ప్లస్ బడ్జెట్ మోడల్స్ కు దగ్గరిలోనే 10 వేల లోపు లెనోవో జూన్ 25 న ఇండియాలో K3 నోట్ ను లాంచ్ చేయనుంది. ఫార్మ్ ఫేక్టర్ పరంగా ఇది సేమ్ లెనోవో A6000 వలె ఉండనుంది. మార్చ్ నెలలో లెనోవో K3 లెనోవో సొంత దేశం చైనా లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు K3 ను ఇంటర్నేషనల్ మర్కెట్స్ లో విడుదల చేస్తుంది కంపెని.
లెనోవో K3 నోట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే – 5.5 in IPS LCD 1080P FHD (ఫుల్ HD) డిస్ప్లే, మీడియా టెక్ MT6752 ఆక్టో కోర్ 1.7GHz ప్రోసెసర్, 2జిబి ర్యామ్, మాలీ -T760MP2 GPU (గ్రాఫిక్స్ కోసం), 16 జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 32 జిబి అదనపు స్టోరేజ్ సదుపాయం, 1080P వీడియోలను 30fps (ఫ్రేమ్స్ పర సెకెండ్) కు రికార్డ్ చేసే 13MP కెమేరా మరియు 5MP ఫ్రంట్ కెమేరా, 3000 mah బ్యాటరీ దీనిలో ఉన్నాయి. లెనోవో K3 నోట్ 8mm సన్నగా 150 గ్రాములు బరువు తో బిల్డ్ అయ్యింది,
లెనోవో బడ్జెట్ సెగ్మెంట్ కు పెట్టింది పేరు అని A6000 మోడల్స్ తో స్పష్టం అయ్యింది. 64 బిట్ ప్రోసేసర్లను A6000 లో జోడించి, డిసెంట్ పెర్ఫార్మేర్ గా, మంచి కెమేరా తో సక్సెస్ఫుల్ గా సేల్స్ చేసుకుంటుంది. ఇదే ఫార్ములా ను బేస్ చేసుకొని ఇప్పుడు పెద్ద తెర తో నోట్ ను లాంచ్ చేస్తుంది. లెనోవో K3 నోట్ ధర చైనా లో 9,284 రూ.
ఆధారం: GSM Arena