లెనోవో CES ఈవెంట్ లో చేతి లో ఇమిడే చిన్న కీ బోర్డ్ cum టచ్ పాడ్, స్మార్ట్ హోమ్ అసిస్టెంట్, గ్లాసెస్ అండ్ స్టోరేజ్ లను ప్రవేశపెట్టింది.
కీ బోర్డ్ పేరు లెనోవో 500 మల్టీమీడియా కంట్రోలర్. ఇది PC, స్మార్ట్ టీవీ ఉన్న వారికీ వైర్లెస్ గా పనిచేస్తుంది. 20m దూరం వరకూ ఉంటుంది. ప్రైస్ సుమారు 3,600 రూ.
స్మార్ట్ అసిస్టెంట్:
ఇది 360 డిగ్రీ మైక్రో ఫోన్ స్పీకర్ తో వచ్చే డివైజ్. ఇంటెల్ celeron N3060 ప్రొసెసర్ పై, 5 watt tweeter అండ్ 10 watt woofer ఆడియో సెట్ అప్ తో మీరు అడిగే అన్నిటికీ సమాధానాలు చెబుతుంది. ఇంట్లో ఒక ప్లేస్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. లౌడ్ స్పీకర్ తో సమాధానం ఇస్తుంది. అమెజాన్ echo కన్నా దీనిలో మంచి సౌండ్ ఉంటుంది అని చెబుతుంది లెనోవో.
స్మార్ట్ glasses:
ఇవి augmented రియాలిటీ తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై పనిచేస్తే స్మార్ట్ కళ్ళజోడు అని చెప్పవచ్చు. లైనక్స్ OS తో రన్ అయ్యే దీని ఉపయోగం మీ చుట్టూ ఉండే వాటిపై పూర్తి సమాచారాలను అందిస్తుంది.