అతి తక్కువ ధరలో లెనోవో 4G LTE ఫోన్ లాంచ్

అతి తక్కువ ధరలో లెనోవో 4G LTE ఫోన్ లాంచ్

లెనోవో ఇండియాలో A2010 పేరుతో కొత్త మోడల్ అనౌన్స్ చేసింది. ఇది both FDD అండ్ TDD 4G ను సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ కనెక్టివిటి తో 4,990 రూ లకు లభ్యమవుతుంది.

లెనోవో A2010 స్పెసిఫికేషన్స్ –  64 బిట్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735 1GHz  ప్రొసెసర్, 1GB ర్యామ్, 4.5 in డిస్ప్లే, 8gb ఇంటర్నెల్ స్టోరేజ్, 32gb అదనపు స్టోరేజ్, 5MP రేర్ led ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1, 4g

ఫ్లిప్ కార్ట్ exclusive గా వైట్ అండ్ బ్లాక్ కలర్ మోడల్స్ తో సేల్ అవుతుంది. నిన్నటి నుండి దీని రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ లింక్ లో రిజిస్ట్రేషన్ అవ్వగలరు  సెప్టెంబర్ 3 నుండి ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. 

లెనోవో A2010 Phicomm Energy 653 మోడల్ కు కాంపిటీషన్. Phicomm ఇప్పటివరకూ ఉన్న అతి తక్కువ  బడ్జెట్ (4,999 రూ) 4G LTE ఫోన్. Phicomm 5 in డిస్ప్లే తో 1.1 GHz స్నాప్ డ్రాగన్ 210 SoC, 1gb ర్యామ్, 8gb అండ్ 64gb sd కార్డ్ సపోర్ట్, 8MP అండ్ 2MP కేమేరాస్, 2230 mah, ఆండ్రాయిడ్ 5.1 తో వస్తుంది.

ఈ మధ్యనే చెన్నై లో లెనోవో made in ఇండియా మూవ్ మెంట్ లో భాగంగా మోటోరోలా మరియు తన లెనోవో బ్రాండ్ ఫోనులను ఇండియాలో తయారు చేసేందుకు ప్లాన్స్ ఫిక్స్ చేసుకుంది. సో ఇప్పుడు లెనోవో K3 నోట్ తో పాటు a2010 మోడల్ కూడా ఇదే ప్లాంట్ లో తయారు అవుతుంది అని న్యూస్.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo