ఇండియన్ మార్కెట్ లో low ఎండ్ బడ్జెట్ లో హై ఎండ్ స్పెక్స్ ను ప్రవేశ పెట్టిన కంపెని, లెనోవో. లెనోవో నుండి వచ్చిన a6000 మరియు a6000 ప్లస్ ఫోన్లు మార్కెట్ లో బాగా పాపులర్
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కంపెని a6000 అండ్ a6000 ప్లస్ మోడల్స్ కు లాలిపాప్ అప్ డేట్ ను రిలీజ్ చేసింది ఇండియాలో. ఇది OTA ద్వారా వస్తుంది. అంటే ఓవర్ ది ఎయిర్ పద్దతిలో ఇంటర్నెట్ ద్వారా ఫోన్ లోనే అఫిషియల్ గా డౌన్లోడ్ చేసుకొని అప్ డేట్ చేసుకోవాలి.
ఇదే అప్ డేట్ లో ఫోన్ హిటింగ్, లేదా ఇతర ప్రాబ్లెమ్స్ ఏమినా ఉన్న సరే అన్నీ రికవర్ అవుతాయి. లెనోవో A6000 ప్లస్ యూజర్స్ కు ఇది 5.0.2 వెర్షన్ కు అప్ గ్రేడ్ అవుతుంది. దీని సైజ్ 1092MB(1GB) ఉంది.
ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ కిట్ క్యాట్ 4.4.4 పై రన్ అవుతున్నాయి ఇంతవరకూ. ఈ లలిపాప్ అప్ డేట్ ద్వారా ఫోన్ పెర్ఫార్మన్స్ అండ్ స్టేబిలిటి కూడా పెరుగుతుంది అని చెబుతుంది.
ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, About Phone పై క్లిక్ చేసి, System Updates లోకి వెళ్లి ఇంటర్నెట్ ఆన్ చేసి(WiFi ప్రిఫరబుల్) స్కాన్ చేస్తే అప్ డేట్ వస్తుంది. దానిని డౌన్లోడ్ చేయటమే, అలానే చేసే ముందు ఒకసారి సాఫ్ట్ వేర్ లో చెబుతున్న విషయాలను బాగా చదివి చేసుకోండి.
లెనోవో A6000 ఈ లింక్ లో 8gb – 1gb వేరియంట్ మోడల్ 7,099 రూ లకు సేల్ అవుతుంది. లెనోవో A6000 ప్లస్ ఈ లింక్ లో 16gb – 2gb ర్యామ్ వేరియంట్ 7,499 రూ లకు సేల్ అవుతుంది.